మహేశ్వరం మండలం ND తండాలో శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ తల్లి దేవతా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించిన మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి పి. సబితా ఇంద్రారెడ్డి వారికి ND తాండ మాజీ సర్పంచ్ రాజు నాయక్, గ్రామపెద్దలు పూజా ఫలాలు అందించి శాలువతో సత్కరించారు. సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ చక్కటి వాతావరణంలో పెద్దమ్మ తల్లి మందిర నిర్మాణం చాలబాగుంది అమ్మవారు ND తాండ వాసులతో పాటు మహేశ్వరం నియోజకవర్గ ప్రజలను చల్లాగా చూడాలని అన్నారు.
కార్యక్రమాలలో
పి.ఏ.సి.ఎస్ వైస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, సీనియర్ నాయకులు పోచారం సుధాకర్ రెడ్డి, కర్రోళ్ళ చెంద్రయ్య, మునగపాటి నవీన్, మాజీ సర్పంచ్ లు మంత్రి రాజేష్, బండారు లింగం, రాజమోని.రాజు, కాడమోని ప్రభాకర్, అల్లే శ్రీశైలం, BRS పార్టీ నాయకులు, మరియు వివిధ పార్టీలకు చెందిన నాయకులు,గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.