మహేశ్వరం, కందుకూరు,బాలాపూర్ మండలాల అధికారులతో సబితా ఇంద్రారెడ్డి సమీక్షా
మహేశ్వరం మండలం కేంద్రం ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో రైతురుణమాఫీ పై మహేశ్వరం, కందుకూర్, బాలాపూర్ మండలాల వ్యవసాయ శాఖ అధికారులతో జరుగు సమీక్ష సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి వర్యులు మహేశ్వరం నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి పి. సబితా ఇంద్రారెడ్డి
సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కందుకూరు,బాలాపూర్ మండలాల రైతులకు ఇప్పటి వరకు 50% రైతులకే రుణమాఫీ జరిగింది.రుణమాఫీ ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంమే.రుణమాఫీ చెయ్యడానికి కుటుంటుంబ సభ్యుల వివరాలతో పని ఏముంది?రైతులు కోట్ల రూపాయల విలువ చేసే భూములు తాకట్టు పెట్టి (లక్షల్లో) రుణం తీసుకుంటే వాళ్ళ వివరాలు ప్రభుత్వం వద్ద లేవా అని ప్రశ్నించారు.ఇవన్నీ లోకల్ ఎలెక్షన్స్ వరకు ఆదిచేస్తాం ఇదిచేస్తాం అని సాగదీసి కాలయాపన చేసి ఎలెక్షన్స్ తరువాత (ఎగ్గొతారు) ఎగనామం పెడతారని అన్నారు.పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రైతు రుణమాఫీ నుండి దృష్టి మళ్లించడానికే హైడ్రా తెరపైకి తెచ్చారన్నారు.కనీసం రైతుబందు ఇవ్వకుండా రైతులను మరింత ఋణగ్రస్థులను చేస్తున్నారని అన్నారు.
కార్యక్రమంలో
ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు,బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.అధికారులను మూడు మండలాల్లో ఎంత మంది రుణం తీసుకున్నారు అని అడగగా వారి దగ్గర సమాధానం లేదు.రుణమాఫీ అయిన వారి వివరాలు మాత్రమే చెప్తున్నారు.