ట్రైబల్ వెల్ఫేర్ నిధులు ద్వారా CC రోడ్డు, నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి.
మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలం మణిక్యమ్మ గూడ గ్రామంలో నిర్మిస్తున్న రోడ్డు,ట్రైబల్ వెల్ఫేర్ నిధులు ద్వారా మంజూరైన CC రోడ్డు,నిర్మాణం వ్యయం 30 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మాజీ మంత్రివర్యులు మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు పి. సబితా ఇంద్రారెడ్డి.
సబితా ఇంద్రారెడ్డితో మణిక్యమ్మ గూడ గ్రామస్తులు మాట్లాడుతూ ఊర్లో గత కొంత కాలంగా విపరీతంగా నీటిసమస్య ఉందన్నారు,కొంతమంది రైతుబందు రావడం లేదు రుణమాఫీ కాలేదని.కేసీఆర్ ఉన్నప్పుడు మమ్మల్ని అన్నివిధాల అదుకున్నాడని సబితా ఇంద్రారెడ్డికి విన్నవించుకున్నారు.
మణిక్యమ్మ గూడ గ్రామస్తులే కాదు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పడుతున్న బాధలు చూసి సబితా ఇంద్రారెడ్డి చలించిపోయారు.ఇంకా నాలుగు సంవత్సరాలు ఈ బాధలు తప్పవు ఏంచేస్తాం అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, BRS పార్టీ నాయకులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.