మహేశ్వరం మండలంలోని పెండ్యాల గ్రామం, హనుమాన్ దేవాలయం దగ్గర జరిపిన “శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ మరియు ఇరుముడి” కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గము శాసనసభ్యురాలు పి.సబితా ఇంద్రారెడ్డి, వారికి స్వాములు స్వాగతం పలికి ఆ హరిహరపుత్రడు అయ్యప్పస్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి షాలువ,మెమోంటోతో సత్కరించారు.
సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ : – అయ్యప్పస్వామిలు మండలం రోజులు దీక్షలో నియమనిష్ఠలతో ఉండి మాలదరణలో ఉన్న రోజులను పండగల జరుపుకునే మీకు,అలాగే మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు ఆ అయ్యప్ప కృపాకటాక్షాలతో సుఖశాంతులతో వర్ధిల్లేలా చూడాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో
ప్రజా ప్రతినిధులు, BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.