- నల్లగొండలో 10 ఎకరాల స్థలంలో స్టేడియం ఏర్పాటు
- మునుగోడులో కూడా ఇలాంటి టోర్నమెంట్ నిర్వహిస్తాం
- ప్రతీక్ ఫౌండేషన్, సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద క్రీడాకారులకు ఆదుకుంటాం : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
నల్లగొండ, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లా కేంద్రంలో క్రికెట్, ఫుట్బాల్ లాంటి ఆటలు ఆడేందుకు పది ఎకరాల స్థలంలో నూతన హంగులతో స్టేడియం ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలో ఎన్జీ కాలేజీ మైదానంలో జరిగిన ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్పీఎల్ ఫైనల్ మ్యాచ్లో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్తో కలిసి ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…నూతన హంగులతో స్టేడియం ఏర్పాటు చేసుకుని సామర్ధ్యం కలిగిన క్రీడాకారులను తయారు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. మునుగోడులో కూడా ఇలాంటి టోర్న మెంట్ నిర్వహిస్తామని చెప్పారు. కోమటిరెడ్డి ప్రతీక్, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద క్రీ డాకారులను ఆదుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, వైస్చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కేసగాని వేణు గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.