48.77 కోట్ల నిధులు మంజూరు..రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కి కొత్త ప్రభాకర్ రెడ్డి కృతజ్ఞతలు

హైదరాబాద్(APB News): దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ ఎంపీ గా ఉన్నపుడు చేగుంట – మెదక్ రోడ్డులో వాహన దారుల ఇబ్బందులను దృష్టి లో ఉంచుకుని ROB మంజూరు కోసం పలుమార్లు కేంద్ర రైల్వే శాఖా మంత్రికి వినతి పత్రాలు అందజేశారు, కానీ వాళ్ళు కొంత రాష్ట్ర ప్రభుత్వం నిధులు కావాలన్నారు.

ROB sanction request letter

తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్ లో సైన్స్ & టెక్నాలజీ, పర్యావరణం మరియు అడవుల పైన స్టాండింగ్ కమిటీ మెంబర్ అయిన తర్వాత ఆ సాన్నిహిత్యంతో దుబ్బాక ఎమ్మెల్యే గా ఎన్నికైన తర్వాత డిసెంబర్ 11, 2023 నాడు ఎంపీ పదవి కి రాజీనామా సమర్పించక ముందు చివరి సారి రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ని డిల్లీ లో మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేయగా తప్పకుండా పూర్తి కేంద్ర నిధులతో చేగుంట వద్ద ROB మంజూరి చేస్తానని హామీ ఇచ్చి ఇటీవల దాని కోసం 48.77 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయటం జరిగింది.

దీని పట్ల కొత్త ప్రభాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేసి, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Share
Share