దేవరకద్ర నియోజకవర్గం : కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని బాలిక సాంఘిక గురుకుల సంక్షేమ పాఠశాలలో RO వాటర్ ఫిల్టర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR).
అనంతరం పాఠశాలలోని సమస్యలు సోలార్ వాటర్ హీటర్ సిస్టం, లైబ్రరీ కి సంబంధించిన మెటీరియల్, ఫర్నిచర్, సామాగ్రిని కావాలని అధ్యాపక బృందం ఎమ్మెల్యే దృష్టికి తేవడంతో..ఎమ్మెల్యే స్పందించి కాంగ్రెస్ పార్టీ నాయకులు సంకిరెడ్డి పల్లి NRI అమర్ రెడ్డి, కొన్నూరు శరత్ రెడ్డి ద్వారా ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా పాఠశాల నూతన భవనం కోసం విజ్ఞప్తి చేయగా ఆమడబాకుల వద్ద ప్రభుత్వ స్థలంలో నూతన పాఠశాల భవన నిర్మాణం కోసం త్వరలో ముఖ్యమంత్రిని కలిసి భవనం మంజూరు చేయిస్తానని తెలియ చేశారు.

తదనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్న కూడా, విద్యార్థిని, విద్యార్థుల సమస్యలను అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని 40% డైట్ చార్జెస్ పెంచినట్లు, బాలికల ప్రత్యేక అవసరాల దృష్ట్యా కాస్మోటిక్ చార్జెస్ పెంచినట్లు చెప్పారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను బ్రష్టు పట్టించిందని అన్నారు, కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో బాలికల పాఠశాలలు తరగతి గదులు, టాయిలెట్స్ లేక విద్యార్థినిలు గత ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారని, అట్టి సమస్యను ఆనాడే గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకున్న పాపన పోలేదని గత ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు, త్వరలో సంక్రాంతి తర్వాత పాఠశాల నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోబోతున్నామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు మరియు పాఠశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు.