దేవరకద్ర నియోజకవర్గం : కొత్తకోట మండలం వట్లంపూడి తాండ లో నాటవెళ్లి పెద్ద తాండ నుండి వట్లంపూడి తాండ వరకు బిటి రోడ్డు నిర్మాణానికి మరియు నాటవెళ్లి వద్ద NH44 నుండి ఊరగట్టు తాండ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR).

అనంతరం నాటెల్లి తండాలో పలువురు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం వారు మాట్లాడుతూ గత పదేళ్ల పాలనలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఒక్కసారి కూడా తమ వట్లంపూడి తాండకు రాలేదని, తమ సమస్యలను పట్టించుకోలేదని తెలిపారు కానీ ఎమ్మెల్యే జిఎంఆర్ తమ తండా మారుమూలల్లో ఉన్న, మా సమస్యలు తెలుసుకుని మా తండాకు బీటీ రోడ్డు వేయించడమే కాక, మా తండాకు విచ్చేయడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
