నల్గొండ కార్పొరేషన్…అభివృద్ధి పనులు షురూ..

నల్గొండ, ఏపీబీ న్యూస్: రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి ఉదయం 08:30 హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తన నివాసం నుండి బయలుదేరి 10:30 గంటలకు నల్గొండ పట్టణంలోని ఇందిరా భవన్ (క్యాంప్ ఆఫీస్) కు చేరుకుంటారని, ఉదయం 11:00 గంటలకు ఈశ్వరమ్మ గుట్ట వద్ద 10 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ ను ప్రారంభిస్తారు. పానగల్ సమీపంలోని  వల్లభరావు చెరువు అభివృద్ధికై 3.65 కోట్ల రూపాయలతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేస్తారని, మధ్యాహ్నం 12:00 గంటలకు లేప్రసీ కాలనీ, అద్దంకి రోడ్డు వద్ద 33/11 KV సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేస్తారని, TUIDC ,SE కార్యాలయం, వాటర్ సప్లై కార్యాలయాలకు ప్రారంభోత్సవం చేస్తారని తెలిపారు.

అనంతరం మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై సమీక్షిస్తారని, మధ్యాహ్నం 01:00 మోతీ కుంట వద్ద నీటి వనరుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని, మధ్యాహ్నం 01:30 నల్గొండ మండలం, డోర్నకల్ వద్ద 33/11 KV సబ్‌స్టేషన్ కు ప్రారంభోత్సవం చేస్తారని తెలిపారు. భోజన విరామం తర్వాత సాయంత్రం 03:00 గంటలకు జిల్లా కలెక్టరేట్‌లో అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై అధికారిక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని, సాయంత్రం 05:00 కలెక్టరేట్ వెనుక భాగంలో 33/11 KV సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేస్తారని, సాయంత్రం 05:30 DEO కార్యాలయం మరియు బస్టాండ్ నుండి పెద్దబండ వరకు సెంట్రల్ లైటింగ్ ను ప్రారంబిస్తారు.

Share
Share