Nalgonda Corporation: మేయర్​ బుర్రి చైతన్య తొలి శిలాఫలకం ఇక్కడే..

నల్లగొండ, ఏపీబీ న్యూస్: నల్లగొండ కార్పోరేషన్ తొలి మేయర్ బుర్రి చైతన్య మొదటిసారిగా బుధవారం పట్టణంలోని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి మేయర్ చైతన్య, పద్మావతి కాలనీ, శివాజీ నగర్లో పార్కుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పద్మావతి కాలనీలో రూ.80 లక్షలు, శివాజీ నగర్ పార్క్కు రూ.50 లక్షలతో పార్కులు నిర్మాణం చేయనున్నారు. మరో విశేషం ఏమంటే మంత్రి కోమటిరెడ్డి తొలిసారి కార్పోరేటర్ జాబితా ప్రకటించిన ఐదుగురి లో భారీ మెజార్టీతో గెలిచిన కేసాని వేణుగోపాల్ రెడ్డి డివిజన్లోనే రూ.80లక్షలతో పనులకు శంకుస్థాపన చేయడం సెంటిమెంట్గా కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. స్మార్ట్ సిటీ పనులు వేగంతం చేస్తానని, రాష్ట్రంలో నల్లగొండను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని మంత్రి స్పష్టం చేశారు. హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి వచ్చిన మంత్రి స్పీడ్ను చూసి పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి మంత్రి నల్లగొండ ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నారు.

komatireddy venkat reddy burri chaithanya 1
komatireddy venkat reddy burri chaithanya 2
Share
Share