Breaking News: మిర్యాలగూడ మున్సిపల్​ చైర్మన్​ గా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి భార్య పోటీ!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మిర్యాలగూడ కాంగ్రెస్లో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి భార్య మాదవి, ఆయన ఇద్దరు కొడుకు సాయి ప్రసన్న, ఈశ్వర గణేష్ కుమార్ నామినేషన్లు వేయడంతో రాజకీయం వేడెక్కింది. మరోవైపు మాజీ చైర్మన్ తిరునగరు భార్గవ్, ఆయన భార్య నాగలక్ష్మీ కూడా నామినేషన్ వేశారు. ఇదిచాలదన్నట్టుగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి భార్య కవిత కూడా నామినేషన్ వేయడంతో అసలు గూడెం కాంగ్రెస్లో ఏంజరుగుతుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. సీట్ల పంపకాల్లో తేడా రావడంతో భార్గవ్ నామినేషన్ వేశారు. రెండు సార్లు మిర్యాలగూడకు వచ్చిన ఎంపీ రఘువీర్ రెడ్డి, ఇంచార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో జరిపిన చర్చలు విఫలమైనట్టు తెలిసింది. భార్గవ్ను వదలిపెట్టి తన వెంట వచ్చిన వాళ్లకే టికెట్లు ఇస్తానని ఎమ్మెల్యే పట్టుబట్టినట్టు తెలిసింది. దీనికి ఎంతమాత్రం ఒప్పుకోని భార్గవ్ వర్గం చివరకు అన్ని వార్డుల్లో నామినేషన్లు వేశారు. భార్గవ్ను పిలవకుండా, ఆయన అనుచరులతో ఎమ్మెల్యే, ఎంపీ జరిపిన చర్చలు విఫలమయ్యాయనని, దాంతోనే పోటాపోటీగా నామినేషన్లు వేశారు. మరోవైపు ఎమ్మెల్యే తన భార్య మాదవిని చైర్మన్ చేయాలనే ఉద్దేశం కూడా ఉందని చెప్తున్నారు.

Bathula Laxma Reddy family
Bathula Laxma Reddy son

కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి భార్య కవిత ప్రభుత్వ ఉద్యోగి. ఆమెను ఉద్యోగానికి రాజీనామా చేయించి నామినేషన్ వేశారు. కవితనే చైర్మన్గా నిలబెడ్తారనే టాక్ ముందు నుంచి వినిపించింది. ఆ నమ్మకంతోనే నెలకు లక్షన్నర జీతం వచ్చే ఉద్యోగాన్ని సైతం రాజకీయాల కోసం పణంగా పెట్టారు. గతంలో తనకు ఈ ఉద్యోగం వచ్చిందనే కవిత కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు. మళ్లీ చైర్మన్ పదవి ఇస్తారని హామీతోనే అదే ఉద్యోగానికి 14 ఏళ్ల సర్వీసు ఉండగానే రాజీనామా చేయడం అందరినీ ఆశ్యర్యానికి గురిచేసింది.

తనకు, తన వర్గానికి కాంగ్రెస్లో జరుగుతున్న అన్యాయం గురించి చర్చించేందుకు తిరునగరు భార్గవ్ శనివారం మిర్యాలగూడలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. తన అనుచరులతో చర్చించి కీలక నిర్ణయం ప్రకటిస్తారు. ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడల వల్ల పార్టీకి తీరని నష్టం జరుగుతుందోని, మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న లీడర్లను పక్కన పెట్టి తన అనుచరులకు కౌన్సిలర్ టికెట్లు ఇచ్చారని, అసలు స్థానికంగా లేకుండా, హైదరాబాద్లో నివాసం ఉంటున్న అభ్యర్థులను సైతం కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్నారని, ఈ పరిణామాల పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన భార్గవ్ వర్గం తమ దారి తాము చూసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే రిజర్వేషన్ల పైన కోర్టును ఆశ్రయించిన భార్గవ్, మరోవైపు బీఆర్ఎస్ తలుపులు తెరిచే ఉన్నాయని చెప్తున్నారు.

Share
Share