రైతులకు రుణమాఫీ అయ్యింది సగం మాత్రమే…

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహేశ్వరం నందు 799 మంది రైతులు రూ. 4.97,28,432/- అక్షరాల “నాలుగు కోట్ల తొంబై ఏడు లక్షల ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ముపై రెండు రూపాయలు” రుణం తీసుకోగా మొదటి విడతలో 284 మంది రైతులకు రూ.1,40,00,000/- అక్షరాల “ఒక కోటి నలబై లక్షల రూపాయలు మాత్రమే రుణ విముక్తి కలిగింది.

రెండో విడతలో 123 మంది రైతులకు రూ.88,00,000/- అక్షరాల”ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు” మాత్రమే రుణ విముక్తి కలిగింది.

మూడో విడతలో 49 మంది రైతులకు రూ.35,16,926/- అక్షరాల “ముపై ఐదు లక్షల పదహారు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు రూపాయలు” మాత్రమే రుణ విముక్తి కలిగింది.

ఇప్పటివరకు మాఫీ అయిన రుణం కాస్త మిత్తి కలుపుకొని రూ. 2,63,16,926/- అక్షరాల రెండు కోట్ల అరవై మూడు లక్షల పదహారు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు రూపాయలు” మాత్రమే మొత్తం రుణంతో పోల్చితే వచ్చింది సగం కూడా కాదు.

rythu runa mafi farmers sad

ఇంకా రుణమాఫీ కానీ రైతులు 343 మంది ఉన్నారు దాదాపుగా రూ.2,50,00,000/- అక్షరాల “రెండున్నర కోట్ల రూపాయలు కావల్సి ఉంది.ఇది మా మహేశ్వరం PACS పరిస్థితి అని మహేశ్వరం మండలం పి.ఎ.సి.ఎస్ డైరెక్టర్ కాడమోని ప్రభాకర్ తెలిపారు.

Share
Share