మహేశ్వరం మండలంలో నిర్మించిన ప్రభుత్వ హాస్పిటల్ కు మొత్తం నిధులు రూపాయలతో 4,00.00.000/- అక్షరాల “నాలుగు కోట్ల రూపాయలు” అప్పటి విద్యాశాఖ మంత్రి వర్యులు ప్రస్తుత మహేశ్వరం శాసనసభ్యురాలు శ్రీమతి పి.సబితా ఇంద్రారెడ్డి గారి ద్వారానే తీసుకురావడం జరిగింది. మరియు అదనంగా నిధులు అవసరమైతే, అమెజాన్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడి CSR నిధుల ద్వారా అదనంగా తీసుకురావడం జరిగింది. పైన పేర్కొన్న నిధులు మొత్తం కేవలం సబితా ఇంద్రారెడ్డి గారి కృషి ఫలితమే. ఈ హాస్పిటల్ ఈ స్థాయిలో ఉండడానికి కర్త, కర్మ, క్రియ మొత్తం సబితా ఇంద్రారెడ్డి గారే… ఎవరి భాగస్వామ్యమూ లేదు…
అధికార పార్టీ నాయకులు నిన్న హాస్పిటల్ సందర్శించడం సంతోషం. సబితా ఇంద్రారెడ్డి గారు హాస్పిటల్ అభివృద్ధికి కృషి చూసినందుకు ఆనందంగా ఉంది. ఆమె యొక్క కృషి, పట్టుదల, అంకితభావం అర్థమయ్యి ఉంటది… కావున వెంటనే బయటకు చెప్పకున్నా లోలోపల ఆనందించినందుకు సంతోషం… అదేవిధంగా ఇంతవరకు మహేశ్వరం లో అనేక అభివృద్ధి పనులు చేసినారు.. ఇంకా కొన్ని అక్కడక్కడ అదనంగా మిగిలిన పనులు ఉంటే, అధికార పార్టీ నాయకులు నిధులు సమకూరుస్తే బాగుంటుంది… కానీ, ఎవరో చేసిన పనుల దగ్గర గొప్పలకు పోతే ప్రజల వద్ద అభాసు పాలవుతారు..
మాతో అభివృద్ధిలో పోటీ పడండి, స్వాగతిస్తాం కానీ రాజకీయాల కోసం చిల్లర వేషాలు వేస్తే ప్రజలు క్షమించరు. అదేవిధంగా మహేశ్వరం ఆసుపత్రి ఆవరణలో సుమారు 60 లక్షలతో ఆక్సిజన్ ప్లాంటు నిర్మించి, కరోనా కష్టకాలంలో మహేశ్వరం మండలంలోని ప్రజలను ఆదుకున్నది సబితా ఇంద్రారెడ్డి కాదా…? మరియు పెద్ద పెద్ద నగరాలలో లేనటువంటి డయాలసిస్ కేంద్రాన్ని మన మహేశ్వరంలో ఏర్పాటు గావించి, సుమారు 40 మంది ప్రతినెల డయాలసిస్ చేయించుకోగలిగే అవకాశం కలిగిందంటే, దానికి సబితా ఇంద్రారెడ్డి కారణం కాదా..?

సబితా ఇంద్రా రెడ్డి గారు పట్టుదలతో 400 పడకల ఆసుపత్రి, మెడికల్ కాలేజీ మంజూరు చేసి, నిధులు సేకరించడం జరిగింది… వాటిని ఒక్క జీవోతో రద్దు చేసిన ఈ ప్రభుత్వం, ఆరోగ్య విషయంలో మహేశ్వరంలో మాట్లాడే హక్కు కోల్పోయింది. అటువంటి మీరా, అభివృద్ధి గురించి మాట్లాడేది..?
గత ప్రభుత్వం సబితా ఇంద్రారెడ్డి ముందు చూపుతో నియోజకవర్గానికి 280 కోట్ల అభివృద్ధి నిధులను మంజూరు చేయించి, శంకుస్థాపనకు సిద్ధంగా ఉన్న పనులను రద్దుగావించి, ఏదో మేము చేస్తున్నామంటే ప్రజలు నమ్మరు… పెద్దపెద్ద మాటలు చెబుతున్న పెద్దలు, వాటిని తిరిగి తీసుకొచ్చి, మేము చేశామని అంటే బాగుంటది.. కానీ జరిగిన పనుల వద్ద ఫోటోలకు ఫోజులు ఇచ్చుకుంటూ కాలయాపన చేస్తే మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు క్షమించరు… వారు ప్రజల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది.. ప్రభుత్వ పెద్దలకు ధైర్యం ఉంటే పైన పేర్కొన్న మెడికల్ కాలేజీ, ఆసుపత్రి మరియు అభివృద్ధి నిధులను మంజూరు చేయించి, మీ చిత్తశుద్ధిని చాటండి.. ప్రభుత్వ పెద్దలు ఇప్పుడైనా తమ తప్పులను తెలుసుకొని అభివృద్ధి వైపు నడిస్తే బాగుంటుంది. సబితా ఇంద్రారెడ్డి చలవతో ఏర్పాటైన ప్రభుత్వ కార్యాలయాలే కాకుండా, మంజూరు చేయించిన పాల్ టెక్నిక్ కాలేజీకి నిధులు సమీకరిస్తే బాగుంటుంది.. అదే విధంగా అసంపూర్తిగా ఉన్న ఎమ్మార్వో ఆఫీస్, కోర్టు భవనము పూర్తిచేస్తే బాగుంటుంది..

ఇకనైనా అధికార పార్టీ వారు కళ్ళు తెరిచి మహేశ్వరం నియోజకవర్గానికి రావలసిన నిధుల గురించి కొట్లాడితే బాగుంటుంది. గత తొమ్మిది నెలలుగా నియోజకవర్గానికి ఎలాంటి నిధులు తీసుకురాకపోగా మంజూరైన 280 కోట్లను రద్దుకు గావిస్తే ప్రజలు క్షమించరు, బి.ఆర్.ఎస్ పార్టీ తరఫున అధికార పార్టీ నాయకులకు సవాలు విసురుతున్నాము… అభివృద్ధిలో సబితా ఇంద్రారెడ్డి తక్కువ చేసి మాట్లాడితే, ప్రజలు, మా కార్యకర్తలు గ్రామాలలో మిమ్మల్ని తిరగనివ్వరని హెచ్చరిస్తున్నాము అని పార్టీ కార్యకర్తలు ,మద్దతుదారులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

కార్యక్రమంలో
PACS వైస్ చైర్మన్ దేవరం వెంకటేశ్వర రెడ్డి, BRS పార్టీ సీనియర్ నాయకులు కర్రోళ్ళ చెంద్రయ్య, మునగపాటి నవీన్, నిమ్మగుడం సుధీర్ గౌడ్, సయ్యద్ ఆదిల్ అలీ, పి.ఏ.సి.ఎస్ డైరెక్టర్ కాడమోని ప్రభాకర్, మండల BRS పార్టీ ఉపాధ్యక్షుడు MD సలీం ఖాన్, గ్రామ శాఖ అధ్యక్షుడు డి.కృష్ణ యాదవ్, కటికల శ్రీను, రెవెళ్ల చెంద్రమౌళి, SK హైమత్, సున్నం కృష్ణ, కటికల మహేందర్, వద్ది శ్రీను, గోల్కొండ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

