Sad News: బడికి వెళ్లమన్న తల్లి… పురుగుల మందు తాగి 4వ తరగతి బాలుడి ఆత్మహత్య

మహబూబాబాద్, ఏపీబీ న్యూస్: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పూసల తండాకు చెందిన 10 సంవత్సరాల నాలుగవ తరగతి విద్యార్థి పవన్ 10 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. మార్చి 11న ఘటన జరిగిన తర్వాత ముందు ప్రభుత్వ ఆసుపత్రిలో, తర్వాత పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రామదాసు, స్వప్న దంపతుల కుమారుడైన పవన్ మృతితో కుటుంబం కోలుకోలేని విషాదంలో మునిగిపోయింది.

పవన్ పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లో ఉంటున్నాడు. తల్లి పాఠశాలకు వెళ్లమని మందలించింది. ఆ తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన నాలుగవ తరగతి బాలుడు.. మార్చి 11న ఘటన జరిగింది. పసివాడు అనుభవించిన మానసిక ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది.

పిల్లలు పాఠశాలకు వెళ్లకపోవడం వెనుక అనేక కారణాలు ఉంటాయి.. bullying, failure fear, anxiety, depression. ‘వెళ్లు’ అని చెప్పడం మాత్రమే పరిష్కారం కాదు. ఎందుకు వెళ్లట్లేదు అని అర్థం చేసుకోవడం అవసరం. 10 ఏళ్ల పిల్లవాడికి కూడా తీవ్రమైన మానసిక ఒత్తిడి వస్తుందని ఈ ఘటన రుజువు చేసింది. పిల్లలతో రోజూ మాట్లాడండి.. వారి feelings వినండి.

తల్లిదండ్రులకు: మీ పిల్లలు పాఠశాలకు వెళ్లట్లేదు, భయంగా ఉన్నారు, తినట్లేదు, ఒంటరిగా ఉంటున్నారు అని అనిపిస్తే తక్షణమే సంప్రదించండి.. Childline: 1098  |  iCall: 9152987821  |  స్కూల్ counselor తో మాట్లాడండి  |  తొందరపడి మందలించకుండా ముందు అర్థం చేసుకోండి.

విశ్లేషణ: పవన్ మృతి మన సమాజానికి చాలా బాధాకరమైన గుణపాఠం. పది సంవత్సరాల పసివాడికి మానసిక ఒత్తిడి handle చేయడం తెలియదు.. అది నేర్పించాల్సిన బాధ్యత పెద్దలది. ప్రభుత్వ పాఠశాలల్లో counselors నియామకం తక్షణ అవసరం. SCERT, తెలంగాణ విద్యాశాఖ పాఠశాల స్థాయిలో మానసిక ఆరోగ్య కార్యక్రమాలు తప్పనిసరిగా నిర్వహించాలి. పిల్లల మానసిక ఆరోగ్యం పుస్తక చదువుకంటే ముఖ్యమైనదని సమాజం అర్థం చేసుకోవాలి.

Share
Share