War Effect: వంటగ్యాస్ రూ.60, కమర్షియల్ రూ.115 పెంపు, నగరాల వారీగా ధరలివే

హైదరాబాద్, ఏపీబీ న్యూస్ డెస్క్: అమెరికా-ఇరాన్ యుద్ధ సంక్షోభం మన వంటగదిలోకి ప్రవేశించింది. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నడుస్తున్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న Oil Marketing Companies (OMCలు) శనివారం అర్ధరాత్రి ముందస్తు ప్రకటన లేకుండా గ్యాస్ ధరలు పెంచాయి. 14.2 kg వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.60 పెరిగింది.. 11 నెలల్లో రెండవ పెంపు ఇది. 19 kg కమర్షియల్ సిలిండర్ రూ.115 పెరిగింది. హైదరాబాద్లో వంటగ్యాస్ కొత్త ధర రూ.965. ఉజ్వల స్కీమ్ సబ్సిడీ కొనసాగుతుంది.

ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల తర్వాత మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ ప్రభావంతో Brent Crude చమురు ధర ఫిబ్రవరి చివరి వారం నుండి $87 per barrel కి చేరింది.. 20.8% పెరుగుదల. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన Strait of Hormuz మార్గంలో అంతరాయాలు నెలకొనే అవకాశాలు పెరిగాయి. భారత్ LPG అవసరాల్లో సుమారు 75-80% దిగుమతి చేసుకుంటుంది.. అందుకే అంతర్జాతీయ ధరల ప్రభావం నేరుగా మన ఇళ్లకు చేరింది.

హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలు వాడే 19kg కమర్షియల్ సిలిండర్ పై దెబ్బ చాలా తీవ్రంగా ఉంది. జనవరి 2026 నుండి ఇప్పటివరకు కమర్షియల్ సిలిండర్ ధర మొత్తం రూ.302.50 పెరిగింది.. మార్చి 1న రూ.28, ఇప్పుడు మరో రూ.115. ఢిల్లీలో 19 kg కమర్షియల్ ధర ఇప్పుడు రూ.1,883. హైదరాబాద్లో రూ.2,110.50కి చేరింది. వారానికి 5 సిలిండర్లు వాడే ఒక చిన్న ఢాభా/హోటల్కు నెలకు అదనపు వ్యయం దాదాపు రూ.7,000.

PM ఉజ్వల యోజన కింద BPL కుటుంబాల మహిళలకు సంవత్సరానికి 12 refills కు రూ.300 సబ్సిడీ ఇప్పటికీ కొనసాగుతుంది. కానీ ఒక నెలకు ఒక సిలిండర్కు మించి వాడే కుటుంబాలకు 13వ సిలిండర్ నుండి పూర్తి market rate చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ వాడే పేద కుటుంబాలపై ఆ అదనపు భారం తప్పదు.

నగరంవంటగ్యాస్ (14.2kg)పెరిగిందికమర్షియల్ (19kg)
హైదరాబాద్₹965+₹60₹2,110.50
ఢిల్లీ₹913+₹60₹1,883
ముంబై₹912.50+₹60₹1,835
కోల్కతా₹939+₹60₹1,990
చెన్నై₹928.50+₹60₹2,043.50

విశ్లేషణ: అర్ధరాత్రి ముందస్తు ప్రకటన లేకుండా ధరలు పెంచడం.. ఇది ప్రభుత్వ పారదర్శకత వైఫల్యం. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ముందే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కారణాలు వివరించినట్లయితే ప్రజల్లో గందరగోళం, panic booking తగ్గేవి. కమర్షియల్ సిలిండర్పై 2026లో రూ.302.50 పెరగడం.. హోటళ్లు, చిన్న వ్యాపారాలపై భారం పెరుగుతుంది, అది మళ్ళీ సామాన్య జనానికి ఆహారధరలు పెంచి వస్తుంది. ఉజ్వల సబ్సిడీ కొనసాగించడం అభినందనీయం. అయితే 12కు మించి వాడే పేద కుటుంబాలకు సంపూర్ణ రక్షణ ఇవ్వాలి. AP, తెలంగాణ ప్రభుత్వాలు స్థానిక VAT తగ్గించడం పరిశీలించాలని APB News కోరుతోంది.

Share
Share