పల్లెల్లో,తండాల్లో ఊపందుకున్న పంచాయతీల ఎన్నికల ప్రచారం

మిర్యాలగూడ(APB News): తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికల పర్వం కొనసాగుతుంది. సర్పంచ్ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారంలో పాల్గొంటూ తమ ఓటర్లకు పలు హామీలు ఇస్తూ ఓట్లను పోందే పనిలో ఉన్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడర్ ఉండడం వల్ల దాదాపుగా అన్ని గ్రామపంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.

పల్లెల్లో, తండాలలో ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలమే కనబడుతుంది. కొందరు అభ్యర్థులు తమ మేనిఫెస్టోని ప్రజల ముందుకు తీసుకొస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు, మరికొందరు అభ్యర్థులు గవర్నమెంట్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూపిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం లావుడి తండా కు చెందిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి లావుడి శ్రీహరి తమదైన శైలిలో ప్రచారంలో విహత్నంగా దూసుకుపోతున్నారు. తండాలో ఎక్కడ చూసిన లావుడి శ్రీహరి పేరు మార్మవుతుంది, ఏ ఓటర్ని కదిలించిన మొదటి వినిపించే పేరు లావుడి శ్రీహరి పేరే. లావుడి శ్రీహరి ఇంటింటి ప్రచారం చేస్తూ తనకు ఎలక్షన్ కమిషన్ కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటు వేయాలని ప్రతి ఓటర్ని వేడుకుంటున్నాడు. అటు యువతను, ఇటు గ్రామ పెద్దలను సమన్వయం చేసుకుంటూ అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఓటర్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు. రేపు 14 తారీకు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లలో లావుడు శ్రీహరికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ తండా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఏ రేత్రి ఏ సహాయమడిగినా కాదనకుండా ఒక అన్నల, ఒక తమ్ముడిలా అందరికీ సహాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకోవడం, అందరికీ సుపరిచితులు, మృదుస్వభావి, విద్యావంతుడు కావడం ఆయనకు కలిసించే అవకాశం గా చెప్పుకోవచ్చు. మరి ఎవరు గెలుస్తారో అనేది 14 తారీకు వరకు వేచి చూడాల్సిందే.

Share
Share