కోటమర్తి కోట పై విష్ణు చక్రం..అడ్డగూడూరులో అడ్డా పెడ్తానంటున్న విష్ణువర్ధన్​ రావు

  • కోటమర్తి కోట పై విష్ణు చక్రం
  • అడ్డగూడూరులో అడ్డా పెడ్తానంటున్న విష్ణువర్ధన్​ రావు
  • బీఆర్​ఎస్ అభ్యర్థిగా రేసులో…అండగా నిలిచిన కమలనాథులు

యాదాద్రి జిల్లా,  ప్రతినిధి, ఏపీబీ న్యూస్​ : కోటమర్తి పంచాయతీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో కోటమర్తిలో పాగా వేసేందుకు బీఆర్​ఎస్​ మద్ధతుతో పాశం విష్ణువర్ధన్​రావు బరిలో నిలిచారు. కోటమర్తి కోట పైన జెండా ఎగురవేసి అడ్డగూడూరు మండలంలో అడ్డా వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గ్రామంలో సామాజిక, కుల సమీకరణాలను బేరీజు వేసుకుని అన్ని వైపులా తనకు కలిసొచ్చే విధం గా పావులు కదుపుతున్నారు. మాజీ మండల ఉపాధ్య క్షుడిగా గతంలో తన సత్తా ఏంటో నిరూపించుకున్న విష్ణువర్దన్​ ఈ సారి సొంత ఊరుకు సేవలు అందించేందుకు ఉత్సాహాంతో ఉన్నారు. కులం, మతం, వర్గాలకు అతీతంగా ఈ ఎన్నికల్లో తనకు మద్ధతు తెలియజేయాలని, గెలుపు తీరాలకు చేర్చాలని కోరుతున్నారు. సర్పంచ్​గా గెలిస్తే గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీరు, వీధిలైట్లు, రోడ్లు, స్కూళ్లు, మెరుగైన వైద్య సదుపా యాలు కల్పిస్తానని హామీ ఇస్తున్నారు.

కోతల బెడద..కుక్కుల విహారం ఉండదు..

గ్రామంలో కోతల బెడద, కుక్కల స్వైర విహారం ఉండదని హామీ ఇస్తున్నారు. రైతులు, పంట పొలాలు ఆగం కాకుండా కోతలు గ్రామంలోకి ప్రవేశించకుండా తగు చర్యలు చేపడ్తానని, అంతేగాక తాగునీటి విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా సొంత ఖర్చులతో మినరల్ వాటర్​ ప్లాంటు ఏర్పాటు చేస్తానని చెప్తున్నారు. స్కూళ్లు, అంగన్ వాడీ సెంటర్లలో పిల్లలకు మెరుగైన వైద్య సేవలు కల్పిస్తానని, సొంత నిధులతో గ్రామంలో గ్రంథాలయ సౌకర్యం కల్పిస్తానని చెప్తున్నారు.

విష్ణువర్ధన్ రావుకె ఎందుకు ఓటెయ్యాలి?

గ్రామంలో తలలో నాలుకలా ఉండే వ్యక్తి, మాజీ మండల ఉపాధ్యక్షుడిగా గతంలో చేసిన సేవలు, ప్రజాపాలన పట్ల ఉన్న అపార అనుభవం, అధిష్టానం పెద్దలతో ఉన్న సన్నిహిత సంబంధాలు తన గెలుపుకు కలిసి వచ్చే అవకాశం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా అధికారులతో సమన్వయం చేసుకొని గ్రామంలో తాగునీరు, రోడ్లు, మెరుగైన వైద్య సదుపాయాలు, సొంత నిధులతో వాటర్​ ప్లాంట్, మినీ గ్రంథాలయం ఏర్పాటు, కోతలు, కుక్కుల బెడద లేకుండా చేయడం, విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేయడం, వృద్ధులు, వితంతవులు, వికలాంగులకు బాసటగా నిలుస్తానంటున్నారు. కోటమర్తి గ్రామ పెద్దలు, యువత, ప్రజలు ఆయనకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. గెలుపు అవకాశాలు కూడా విష్ణువర్ధన్ రావుకి ఎక్కువగా ఉన్నాయని గ్రామ పెద్దలు అక్కడి ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Share
Share