వార్డు అభ్యర్థులను సర్వేల ద్వారా డిసైడ్ చేస్తాం: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ కార్పోరేషన్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ 45 సీట్లు గెలవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకాంక్షించారు. 48 వార్డుల్లో మేయర్​ పోటీ చేసే స్థానం, మరొక రెండు, మూడు వార్డులు మినహాయిస్తే 45 వార్డుల్లో కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గురువారం నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ కొత్త సంవత్సరం కానుగా నల్లగొండను కార్పోరేషన్​ చేశానని, దీని వెనక రెండు నెలల శ్రమ ఉందని, 14 మంది మంత్రులు, సీఎం రేవంత్​రెడ్డి ఆమోదంతో అసెంబ్లీ, మండలిలో బిల్లు పాస్​ చేయడం జరిగిందని చెప్పారు. కొత్త ఏడాది కానుకగా నల్లగొండ పట్టణ ప్రజలకు కార్పోరేషన్​ బహుమతిగా ఇచ్చానని, మీరంతా నాకు రిటర్న్​గిఫ్ట్​గా ఎన్నికల్లో కాంగ్రెస్ ​పార్టీని గెలిపించి ఇవ్వాలని కోరారు.

komatireddy venkat reddy 2

వార్డుల్లో మంచి అభ్యర్థులను నిలబెట్టేందుకు సర్వేలు చేస్తారని, మేధావుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటారని, ఆ మేరకు నిలబట్టే అభ్యర్థులను ప్రజలు గెలిపించాలన్నారు. నల్లగొండను రాష్ట్రంలో రోల్​ మోడల్​గా చేయాలన్నదే నా తపన. హైదరాబాద్​కు అతి సమీపంలో ఉన్న నల్లగొండను స్మా ర్ట్​ సిటీగా చేయాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. ఇప్పటికే పట్టణం లో రెండు వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, వ చ్చే రెండు,మూడేళ్లలో చేపట్టాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయ ని, క్లాక్​టవర్​ సెంటర్​ను కూడా అద్బుతంగా తీర్చిదిద్దే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు.

komatireddy venkat reddy 1

రెండు వేల కోట్లతో అభివృద్ధి ..

పట్టణంలో రూ.272 కోట్లతో అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ పనులు, రూ.53 కోట్లతో సీసీ రోడ్లు, రూ.109 కోట్లతో మౌలిక వసతులు, రూ.16 కోట్ల తో రోడ్ల అభివృద్ధి, రూ.4.50 కోట్లతో మోతికుంట, వల్లభారావు చెరువుల అభివృద్ధి, రూ.900కోట్లతో ఔటర్​ రింగ్​ రోడ్డు, రూ.9 కోట్లతో 3 సబ్​ స్టేషన్​లు, రూ.140 కోట్లతో లతీఫ్ ​సాహెబ్​ గుట్ట, బ్రహ్మంగారి గుట్టకు రోడ్డుమార్గం, అన్నేశ్వర గుట్ట వద్ద అమృత్-2 పథకం రూ.1.4 5 కోట్లతో 1100 లీటర్ల ట్యాంకు పనులు జరుగుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.

Share
Share