- 48 డివిజన్లలో విస్తృత పర్యటన
- ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటర్ను కలవాలి
- చేసిన అభివృద్ధి చెప్పాలి…సమస్యలు గుర్తించాలి
- క్లీన్ స్వీప్ చేయడంమే నా టార్గెట్
- అభ్యర్థులతో మంత్రి కోమటిరెడ్డి జూమ్ మీటింగ్
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ కార్పోరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల కార్యచరణ సిద్ధం చేశారు. ఓవైపు మేడ్చల్ ఇంచార్జిగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరో వైపు సొంత నియోజకవర్గంలో పార్టీ గెలుపు కోసం పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. కార్పోరేషన్ గెలుపు బాధ్యతలను భుజానెత్తుకున్న మంత్రి 48 వార్డుల్లో రోడ్ షో చేయాలని నిర్ణయించారు. సోమవారం లేదంటే మిర్యాలగూడలో సీఎం రేవంత్ సభ తర్వాత నల్లగొండలో రోడ్ షో కార్యక్రమం మొదలు పెడ్తారు. అభ్యర్థులు ఎవరికి వారు ప్రచారంలో బిజీగా ఉండాలని, రోడ్ షో కార్యక్రమాన్ని నేనే సొంతంగా నిర్వ హిస్తానని మంత్రి స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా ఎన్నికల సన్నద్ధం పై అభ్యర్థులకు దిశానిర్ధేశం చేశారు. ఇంటిలిజెన్స్ రిపోర్ట్లు ఎప్పటికప్పుడు తనకు చేరుతు న్నాయని, నల్లగొండలో ఎవరు ఏం చేస్తున్నారో తనకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతుందోని చురకలు అట్టించారు. ఈ ఎన్నికల్లో 48 వార్డుల్లో అభ్యర్థులు గెలిచి తీరాలని, నిత్యం ఓటర్లతో టచ్లో ఉండాలని, చేసిన అభివృద్ధి గురించి చెప్పడంతో పాటు, వార్డుల్లో నెలకొన్న సమస్యల గురించి జనాలను అడిగి తెలుసుకోవాలని మంత్రి చెప్పారు.

అభ్యర్థులఎంపికలోసామాజికన్యాయంపాటించాం
కార్పోరేటర్ల ఎంపికలో సామాజిక న్యాయం పాటించామని, 70శాతం సీట్లు బీసీలకు కేటాయించి రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచామని మంత్రి చెప్పారు. 48 డివిజన్లు గెలిస్తే నల్లగొండ అభివృద్ధికి ఎన్ని నిధులైన తెస్తానని, ఈ ఎన్నికల్లో మీరు గెలిస్తే నేను గెలిచినట్టేనని మంత్రి అన్నారు. అన్ని సీట్లు గెలిస్తే సీఎం ని అడిగి ఎన్ని నిధులు అయినా తెస్తానని స్పష్టం చేశారు.
