- 48 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించాలి
- అధికారంలో ఉన్న అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి
- మున్సిపాలిటీలో రూ.2,200 కోట్లతో అభివృద్ధి పనులు
- ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన మంత్రి కోమటిరెడ్డి
- తొలి విడతలో నలుగురు అభ్యర్థుల ప్రకటన
నల్లగొండ, ఏపీబీ న్యూస్: గత పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి శూన్యమని, నల్లగొండను అభివృద్ధి చేసింది తానేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఆదివారం నల్లగొండలో కార్పోరేషన్ ఎన్నికల ప్రచారాన్ని మంత్రి ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎప్పుడో బొంద పెట్టారని, కాంగ్రెస్ అధికారంలో వచ్చాకే అభివృద్ధి వేగవంతం అయ్యిందని మంత్రి తెలిపారు.
ఈ ఎన్నికల్లో 48 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా తొలి విడతలో నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. 6వ డివిజన్ కార్పొరేట్ అభ్యర్థిగా కర్నాటి సునంద కర్ణాకర్ రెడ్డి, 25వ డివిజన్ అభ్యర్థిగా జూలకంటి ధనలక్ష్మి శ్రీనివాస్, 41వ డివిజన్ అభ్యర్థిగా కేసాని వేణుగోపాల్ రెడ్డి, 19వ డివిజన్ అభ్యర్థిగా గోగుల గణేష్ను మంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి పట్టణంలో ట్రాక్టర్ డ్రైవ్ చేస్తూ పట్టణంలో పర్యటించారు.

అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులు గెలిస్తే పట్టణం మరింత అభివృద్ధి చెందుతదని, ప్రస్తుతం రూ.2,200 కోట్లతో అభివృద్ధి పనులు నడుస్తున్నాయని మంత్రి తెలిపారు. మున్సిపాలిటీని కార్పొరేషన్ గా చేయడంతో మరింత అభివృద్ధి చెందుతదని తెలిపారు.