- తొలి రెండేళ్లు ఎర్నేని కుసుమ (కమ్మ)
- వైస్ చైర్మన్గా దేవరం మళ్లీశ్వరి రెడ్డి
- తర్వాత మూడేళ్లు పార సత్యవతి (మున్నూరు కాపు)
- గుండపనేని పద్మావతి (వెలమ)
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: కోదాడ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకున్నారు. తొలి రెండేళ్లు ఎర్నేని కుసుమ చైర్మన్గాను, దేవరం మళ్లీశ్వరిరెడ్డి వైస్ చైర్మన్గా వ్యవహారిస్తారు. తర్వాత మూడేళ్లు చైర్మన్గా పార సత్యవతి, వైస్ చైర్మన్గా గుండపనేని పద్మావతి ఉంటారని ఇరువర్గాల మధ్య ఒప్పందం జరిగింది. కుసుమ, మళ్లీశ్వరిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన కౌన్సిలర్లు. చైర్మన్ పదవికి పట్టణంలో కాంగ్రెస్ హేమాహేమీలు పోటీ పడ్డారు. మాజీ సర్పంచ్, సీనియర్ నేత ఏర్నేని వెంకటరత్నం బాబు భార్య కుసుమ, సీనియర్ నేత మంత్రి ఉత్తమ్కు అత్యంత సన్నిహితుడు లక్ష్మీనారాయణ రెడ్డి సమీప బందువుల దేవరం మళ్లీశ్వరిరెడ్డిల మధ్య పోటీ ఏర్పడింది.
మరోవైపు బీసీ కోటాలో గత ఎన్నికల్లో చైర్మన్గా పోటీ చేసి ఈ ఎన్నికల్లో గెలిచిన పార సీతయ్య భార్య సత్యవతి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు అనుచరుడు ప్రగతి ట్రాన్స్పోర్ట్ నాగేశ్వరరావు భార్య పద్మావతి పోటీ పడ్డారు. ఏకాభిప్రాయ సాధన కోసం మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి కౌన్సిలర్లతో వన్ టు వన్ చర్చలు జరిపారు. కానీ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చివరకు పదవుల పంపకాలు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో తొలి రెండేళ్లు కమ్మ, రెడ్లకు, చివరి మూడేళ్లు మున్నూరు కాపు, వెలమ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది.