హైదరాబాద్(APB News): సనత్ నగర్ నియోజకవర్గంలోని అమీర్ పేట్ పరిధిలో గల కనకదుర్గ ఆలయ నూతన రినోవేషన్ బోర్డు గురువారం కొలువుదీరింది. ఈ సందర్భంగా ఆలయ ఈవో అంబుజా, చైర్మన్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబెర్ కే.మల్లికార్జునప్ప కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. ఆలయ నూతన రినోవేషన్ బోర్డు కమిటీ సభ్యులుగా సీహెచ్ నరేష్ కుమార్, వివేక్ నాథ్, సాయి సుబ్రహ్మణ్యం, విజయలక్ష్మి, సరిత, సుకన్య, అండాలు గౌడ్, డాక్టర్ సింగం శ్రీనివాస్, పీ. శ్రీకాంత్, రాజేశ్వర్ రావు, సత్తిబాబు, శ్రీనివాస్, సాయిప్రసాద్ గౌడ్ నియామక పత్రాలు అందుకున్నారు.

అనంతరం పునర్నిర్మాణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పురోహితులు పాల్గొన్నారు.