కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు లో అవినీతి అక్రమాలు జరిగాయని, అవినీతిని ప్రశ్నిస్తూ రాజలింగ మూర్తి కోర్టు లో కేసు వేశారు. మూర్తి ని అతిదారుణంగా హత్య చేయబడం చాల బాధాకరం. నిందితులు ఎవరితో టచ్ లో ఉన్నారు? వారి వెనుకాల ఏమైనా రాజకీయ శక్తులు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలి. మాజీ సీఎం కెసిఆర్, నాటి ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు, మాజీ MLA గండ్ర వెంకటరమణ రెడ్డి ల పాత్ర ఉంది అని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
BRS ప్రభుత్వం హయాంలో కూడ మూర్తి గారిని చాల రకాలుగా వేధించినట్లుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆ కోణంలో కూడ దర్యాప్తు చేయాలి.BRS పదేండ్ల లో హత్యా రాజకీయాన్ని పెంచి పోషించింది. జ్యూడిశియల్ దర్యాప్తును వేగవంతం చేయాలనీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, సనత్ నగర్ నియోజకవర్గం ఇంచార్జి డా. కోట నీలిమ కోరారు.