ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్‌ను విజయవంతం చేయండి: ట్రస్మా

నల్లగొండ, ఏపీబీ న్యూస్​: ట్రస్మా పట్టణ శాఖ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో జనవరి 8వ మరియు 9వ తేదీలలో ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్‌ను నిర్వహించనున్నట్లు ట్రస్మా రాష్ట్ర నాయకులు, ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ గేమ్స్ కన్వీనర్ శ్రీ కొలనుపాక రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్మా నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ, ఈ క్రీడా పోటీలకు నల్గొండ పట్టణంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు పాల్గొననున్నారని తెలిపారు. అలాగే పాఠశాలల వ్యవహర్తలు తమ విద్యార్థులతో కలిసి ఈ గేమ్స్‌లో చురుకుగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ముఖ్య అతిథులుగా

తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, బూరి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి, బండారు ప్రసాద్ హాజరవుతారని తెలిపారు. కావున ఈ ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ట్రస్మా నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు M. రామ్ మోహన్, జిల్లా స్పోక్స్ పర్సన్ A. శ్యామ్ సుందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు N. రమేష్ రెడ్డి, జిల్లా నాయకులు పోలోజు నాగేందర్, M.D. ఫయాజ్, చర్లపల్లి గణేష్, జానారెడ్డి, బిజ్జు జోసెఫ్, జీ. జానయ్య పాల్గొన్నారు.

Share
Share