- భీమా పేరుతో మోసం
- భీమా డబ్బులు నామినీకి ఇవ్వకుండా పేరు మార్పు
- కోదాడ లో బయటపడిన ఉదంతం.
కోదాడ , ఏపీబీ న్యూస్: సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీపురం కాలనీలో చనిపోయిన వ్యక్తి పేరిట ఇన్సూరెన్స్ కాజేసేందుకు ఏకంగా నామినీ పేరునే మార్చిన మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. లక్ష్మీపురం కాలనీకి చెందిన ముంతాజ్ బేగం అనే మహిళ 2022 ఏప్రిల్ 12 వ తేదీన మృతి చెందింది. ఆమె కు అంతకముందు లేబర్ ఇన్సూరెన్స్ కార్డు ఉంది. ఆమె మరణించిన తరువాత లక్ష్మీపురం కు చెందిన కొందరు ఆమెకు లేబర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇప్పిస్తామని ఆమె ఇన్సూరెన్స్ కు నామినీ గా వున్న ఆమె కుమార్తె నసీమా కు తెలిపారు. ఇది జరిగి మూడు సంవత్సరాలు అయినా ఆ డబ్బులు ఇవ్వలేదు. ఇదేమిటని అడిగితే నీకు క్లెయిమ్ కింద 50వేల రూపాయలు, ప్రభుత్వం పేదలకు మంజూరు చేసే ఒక ప్లాట్ ఇస్తామని హామీ ఇచ్చారు. కాగా ఇటీవల ముంతాజ్ బేగం పేరిట ప్రధాన మంత్రి జీవన జ్యోతి ఇన్సూరెన్స్ ఉందని, క్లెయిమ్ చెల్లించేందుకు విచారణ నిమిత్తం కోదాడ యూనియన్ బ్యాంక్ అధికారులు లక్ష్మీపురం కాలనీ కి వచ్చారు. అక్కడ విచారణ జరుతున్న సమయంలో ముంతాజ్ కుమార్తె నసీమా అక్కడకు వెళ్లగా అసలు విషయం బయటకు వచ్చింది.
ఆమె పాలసీకి నామినీగా నసీమా భర్త కరీం పేరు ఉండాల్సి ఉండగా నసీమా బేగం అని ఉంది. ఇది గమనించిన నసీమా వారిని నిలదీయగా లేబర్ ఇన్సూరెన్స్ పేరుతో వారు బ్యాంక్ లో పాలసీ తీసుకొని 2. 5 లక్షల రూపాయలు క్లెయిమ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారని తెలిసింది. తనకు చెప్పిన విధంగా 50వేల నగదు, ప్రభుత్వ స్థలం ఇప్పిస్తామని చెప్పిన మాటలు ఆమె నమ్మలేదు. దీనితో శనివారం ఆమె మీడియా ఎదుట ఈ విషయాన్ని బయటపెట్టింది. కాగా ఈ సంఘటన పై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని కోదాడ పట్టణ పోలీసులు తెలిపారు.