నల్లగొండ, ఏపీబీ న్యూస్: ఇండియన్ మెడికల్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండలో హోలీ వేడుకులు ఘనంగా జరిగాయి. జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రమేష్, సెక్రటరీ విజయ్ మాట్లాడుతూ… మొదటిసారిగా చాలా పెద్ద ఎత్తున అనేకమంది డాక్టర్ల మధ్య హోలీ వేడుకలు అత్యంత అద్భుతంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ.. ప్రతి ఏడాది లైన్స్ క్లబ్ ద్వారా నల్గొండలో అనేక మంది ప్రముఖుల మధ్య హోలీ పండుగ జరుపుకుంటుండగా ఈసారి విభిన్నంగా డాక్టర్లు అందరు ఒకే వేధిక పైన జరుపుకోవడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్లు జార్జి ప్రవీణ్, ఏవి శ్రీనివాసరావు, యాదయ్య, PVN మూర్తి, డాక్టర్ అనిత రాణి, ప్రవీణ్, త్రివేణి, సుబ్బారావు, వినోద్ కుమార్, డాక్టర్ సురేష్ కుమార్, నాగేష్, వసంత కుమారి, హేమలత, లీలావతి, అరుంధతి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వినూత్న గెటప్లో ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ పుల్లారావు
