Breaking News: మధర్​ డెయిరీలో డైరక్టర్లదే ఇష్టారాజ్యం…ఎండీది అంతులేని అవినీతి

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మధర్ డెయిరీ పాలకవర్గంలోని 15 మంది డైరక్టర్లు ఒక్కొక్కరు ఒక్కో చైర్మన్గా రాజ్యమేలుతున్నరు. పదిహేను రోజుల వ్యవధిలోనే ఇద్దరు చైర్మన్లు రాజీనామా చేయడంతో డైరక్టర్లు అందరు ఎవరికి వారే చైర్మన్లుగా చలామణి అవుతు రైతులు, ఉద్యోగుల పైన పెత్తనం చలాయిస్తున్నారు. రూ.12 కోట్లు పాల బిల్లులు చెల్లిస్తానని ప్రగల్భాలు పలికిన మందడి ప్రభాకర్ రెడ్డి చైర్మన్ పదవికి రాజీనామా చేయడం డెయిరీని కుదిపేసింది. మాజీ చైర్మన్ మధుసూధన్ రెడ్డి బ్యాంకులకు ఫిర్యాదు చేయడంతోనే ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేయాల్సి వచ్చింది. బ్యాంకు అప్పు రూ.28 కోట్లు వెంటనే వసూలు చేయాలని లేదంటే డెయిరీని సీజ్ చేయాలని బెదిరించినట్టు తెలిసింది. మొత్తం అప్పులో ఫిబ్రవరి 1లోగా రూ.10 కోట్లు చెల్లించాలని లేదంటే డెయిరీ సీజ్ చేస్తామని నోటీసు ఇచ్చారు. బోగస్ ఆడిట్ రిపోర్టులతో మోసం చేసిన పాలకవర్గం బ్యాంకు నోటీసులతో కంగుతిన్నది. బటర్ డిస్ట్రిబ్యూటర్తో ఒప్పందం మేరకు రూ.12 కోట్లలో తొలి విడత రూ.3కోట్లు డెయిరీ ఖాతాలో జమ చేశారు. బ్యాలెన్స్ రూ.9 కోట్లు రైతులకు ఇవ్వకుండా బ్యాంకుకు చెల్లిస్తే డెయిరీలో సంక్షోభం తలెత్తుదని భావించి ప్రభాకర్రెడ్డి రాజీనామాకు పూనుకున్నారు. చైర్మన్ రాజీనామా ఆమోదించేందుకు ఫిబ్రవరి 2న బోర్డు సమావేశం పెట్టాలని నిర్ణయించారు, కానీ అసలు పాలకవర్గాన్నే రద్ధు చేయాలని, డైరక్టర్ల చర్యలతో రైతులు, ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

nalgonda rangareddy narmul mother dairy

డెయిరీ ఎండీ కృష్ణను తొలగించాలని మండలి చైర్మన్ గుత్తా సఖేందర్ రెడ్డి ఎప్పుడో చెప్పారు. మాల్, మల్లేపల్లి, కందుకూరులో చిల్లింగ్ సెంటర్లలో పాలను కల్తీ చేసిన సంఘటనలో ఎండీ పైన ఎస్ఓటీ పోలీసులు కేసు పెట్టారు. అడ్డదారిలో ఎండీ పదోన్నతి పొంది, తనకు మంత్లీ కమీషన్లు ఇచ్చే పాల డిస్ట్రిబ్యూటర్లకు లీటర్కు రూ.2లు ఎక్కువ చెల్లించి లక్షలు కొల్లగొట్టారు. రూ. 46 కోట్లు నష్టాలో ఉన్న డెయిరీని బోగస్ ఆడిట్ రిపోర్ట్లో రూ.14 కోట్లకు తగ్గించి రుణం పొందడం వెనక ఎండీ హస్తం ఉంది. ఎన్డీడీబీతో ఒప్పందాన్ని అడ్డుకున్నారు. చిల్లింగ్ సెంటర్లలో అక్రమాలకు పాల్పడుతున్న ఉద్యోగులను బదిలీ చేస్తే డైరక్టర్లను అడ్డంపెట్టి రాజకీయాలు నడిపారు. ఇవన్నీ మాజీ చైర్మన్ మధుసూధన్ రెడ్డి బయట పెడ్తాడనే ఉద్దేశంతో ఆయన్ని పదవి నుంచి తప్పించారు.

MD Krishna

ప్రభాకర్ రెడ్డి తప్పుకోవడంతో డెయిరీని నడిపించే నాధుడే కరువయ్యారు. మరోవైపు పాలకవర్గాన్ని రద్ధు చేయాలని సొసైటీ చైర్మన్ లు డిమాండ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 1న బోర్డు మీటింగ్ వద్దని జనరల్ బాడీ నిర్వహించాలని పట్టుబడుతున్నారు. రూ.28కోట్ల పాల బిల్లులు చెల్లించకుండా డైరక్టర్లు డ్రామాలు ఆడుతున్నారని, ఉద్యోగుల జీతాల్లో 30శాతం కోత పెట్టేందుకు చక్రం తిప్పుతున్నారని మండిపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో డెయిరీని కాపాడుకోకపోతే చిత్తూరు, కర్నూలు, పొద్దుటూరు తరహాలో డెయిరీ మూతపడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

ఈ పరిస్థితుల్లో మధర్డెయిరీని కాపాడుకోకపోతే రైతులు, ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం ఉందని గ్రహించిన మాజీ చైర్మన్ జితేందర్ రెడ్డి సొసైటీ అధ్యక్షులతో భేటీ అవుతున్నారు. డెయిరీలో చోటు చేసుకున్న పరిణామాలు, భవిష్యత్తు కార్యచరణ గురించి అధ్యక్షులతో చర్చిస్తున్నారు. జితేందర్ రెడ్డికి అధ్యక్షులు సహకరించొద్దని చిల్లింగ్ సెంటర్ల మేనేజర్లకు డైరక్టర్లు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. పాల బిల్లులు తక్షణమే చెల్లించాలని, లేని పక్షంలో పాలకవర్గాన్ని డిస్మిస్ చేయాలని, డైరక్టర్లు రాజీనామా చేయాలని ఎండీ కృష్ణ, రంగారెడ్డి జిల్లా డీసీఓకు నోటీసు ఇవ్వనున్నారు. అదే జరిగితే తన ఉద్యోగానికే ఎసరొస్తదని, అక్రమాల పైన విచారణ జరిగితే చట్టపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సివస్తదని ఎండీ కృష్ణ డైరక్టర్లను అడ్డం పెట్టి మరో పొలిటికల్ గేమ్కు తెరతీసినట్టు తెలిసింది.

Share
Share