హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, కొత్తపేట, దిల్సుఖ్నగర్, నాగోల్, ఉప్పల్, మలక్ పేట్, జూబ్లీహిల్స్ ,బంజారాహిల్స్, ఫిలింనగర్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ ,లింగంపల్లి, కూకట్ పల్లి, మియాపూర్, చందానగర్, నిజాంపేట, పటాన్ చెరు,అమీర్ పేట,పంజాగుట్ట,బేగంపేట, యూసఫ్ గూడ్, బోరబండ, ఖైరతాబాద్, లక్డీకపూల్, సికింద్రాబాద్, బోయిన్ పల్లి, ఈసీఐఎల్ లో వర్షం పడుతోంది.
సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు మోండా మార్కెట్, బన్సీలాల్ పేట్, రాంగోపాల్ పేట్,బేగంపేట సీతాఫల్ మండి, మారేడ్ పల్లి, అడ్డగుట్ట, కుత్బుల్లాపూర్ సుచిత్ర, కొంపల్లి, సూరారం, జీడిమెట్ల, బహదూర్ పల్లి, గండి మైసమ్మ, గాజులరామరంలో వర్షం కురుస్తోంది.
పలు కాలనీలు వర్షానికి జలమయమయ్యాయి. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. నగర వాసులు వర్షాలు పడుతున్న సమయంలో అత్యవసరం అయితే బయటకు రావొద్దని సూచించారు.వాహనదారులు రోడ్లపై నీళ్లు చేరడంతో జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు.