లక్నోలో తెలంగాణ శాసన మండలి బృందం పర్యటన

లక్నో/నల్గొండ, ఏపీబీ న్యూస్: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ’86వ ఆల్ ఇండియా ప్రెసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్’ (AIPOC)లో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ శాసనసభ, మండలి ఉన్నత స్థాయి బృందం నేడు నగరంలోని పలు చారిత్రక ప్రాంతాలను సందర్శించింది.

తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నేతృత్వంలోని ఈ బృందంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, మండలి సెక్రెటరీ డాక్టర్ నరసింహా చార్యులు, శాసనసభ సెక్రెటరీ ఆర్. తిరుపతి మరియు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.

సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన స్టడీ టూర్ లో భాగంగా సోమవారం ఈ బృందం లక్నోలోని ప్రసిద్ధ పర్యాటక మరియు చారిత్రక కట్టడాలను సందర్శించింది. ముఖ్యంగా:

  • బార ఇమాం బార & బుల్ బులయియా: మొఘల్ వాస్తుకళకు నిలువుటద్దంగా నిలిచే ఈ అద్భుత కట్టడాలను బృందం పరిశీలించింది.
  • చోట ఇమాం బార & క్లాక్ టవర్: నవాబుల కాలం నాటి విశిష్టతను చాటిచెప్పే ఈ ప్రాంతాల చరిత్రను వారు తెలుసుకున్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న శాసనసభలు, మండలిల పనితీరు, ప్రజాస్వామ్య విలువల బలోపేతం మరియు సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై చర్చించేందుకు ఈ 86వ ఆల్ ఇండియా ప్రెసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ వేదికైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో తెలంగాణ తరపున మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

ఈ పర్యటన ద్వారా ఇతర రాష్ట్రాల శాసన ప్రక్రియలను అధ్యయనం చేసే అవకాశం లభిస్తుందని, ఇది మన రాష్ట్ర శాసన వ్యవస్థకు మరింత ప్రయోజనకరంగా మారుతుందని అధికారులు వెల్లడించారు.

Share
Share