నల్లగొండ, ఏపీబీ న్యూస్: నల్గొండ జిల్లాలో కలెక్టర్ గా పని చేసిన 14 నెలల కాలం మర్చిపోలేనిదని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా బదిలీపై వెళ్లిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం ఉదయాదిత్య భవన్ లో ఏర్పాటుచేసిన వీడ్కోలు సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో పేద ప్రజల సంక్షేమం కోసం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో జిల్లా అధికారుల సహకారం మరువలేనిదని అన్నారు. కొత్త కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలలో అధికారులందరూ సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న కలెక్టర్ ఇలా త్రిపాఠిని జ్ఞాపికలు, శాలువాలు, పూల మాలలతో ఘనంగా సత్కరించారు.

ఈ వీడ్కోలు కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఆర్ డి ఓ లు అశోక్ రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, జిల్లా, మండల అధికారులు, తదితరులు హాజరయ్యారు.