జిల్లాల వారీగా రిజర్వేషన్లు ఖరారు.. జనరల్ కి ఎన్ని వార్డులు కేటాయించారంటే!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మున్సిపాలిటీల్లో బీసీలకు 124 వార్డులు ఖరారు చేశారు. ఉమ్మడి జిల్లాలోని 18 మున్సిపాలిటీలు, ఒక కార్పోరేషన్లో 427 వార్డులు ఉన్నాయి. దీంట్లో బీసీ, బీసీ మహిళలకు 124, జనరల్, జనరల్ మహిళలకు 216, ఎస్సీ, ఎస్సీ మహిళలకు 60, ఎస్టీలకు, ఎస్టీ మహిళలకు 27 వార్డులు రిజర్వు చేశారు. 50 శాతం మహిళల కోటా కింద 211 వార్డులు కేటాయించారు. నల్లగొండ జిల్లాలో ఎస్టీలకు 12, ఎస్సీలకు 24, బీసీలకు 55, జనరల్, జనరల్ మహిళలకు 91, సూర్యాపేట జిల్లాలో ఎస్టీలకు 9, ఎస్సీలకు 22, బీసీలకు 38, జనరల్, జనరల్ మహిళలకు 72, ఎస్టీలకు 6, ఎస్సీలకు 14, బీసీలకు 31, జనరల్, జనరల్ మహిళలకు 53 వార్డులు రిజర్వు చేశారు.

ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్ల పర్సంటేజీ ప్రకారం వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియ మొదలు పెట్టారు. శుక్రవారం ఆయా జిల్లాల కలెక్టర్లు ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. రొటేషన్ పద్ధతిలో వార్డుల రిజర్వేషన్లు మారుతుండటంతో ఏ వార్డు ఎవరికి రిజర్వేషన్ అవుతుందో తెలుసుకునేందుకు ఆశావహులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఒక వేళ రిజర్వేషన్ లు మారితే పక్క వార్డుల్లో పోటీ చేసేందుకు ఉన్న అనువైన మార్గాల గురించి ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా జనరల్ వార్డులు బీసీలకు మారడం వల్ల అగ్రకులాలకు చెందిన ఆశావహులు టెన్షన్ పడుతున్నారు. జనరల్ వార్డులు సైతం బీసీలకు రిజర్వు అయితే ఈ రెండు కేటగిరీలకు చెందిన ఆశావహులు పరస్పర అవగాహన కొరకు సంప్రదింపులు జరుపుతున్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు అయిన వార్డులు సైతం ఈ దఫా రొటేషన్లో మారునున్నాయి. దాంతో ఆయా వార్డుల్లో పోటీ చేసేందుకు ఇన్నాళ్లు ఎదురు చూసిన ఆశావహులకు కలిసిస్తోంది. గత ఎన్నికల రిజర్వేషన్ డేటా, జనాభా గణాంకాలు, రొటేషన్ విధానం వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నారు.

Share
Share