Municipal Elections: ఆఖరి రోజు తీన్​మార్​.. చండూరులో ఎమ్మెల్యే రాజోపాల్​ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి జిల్లాలోని 17 మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం చివరి రోజైన సోమవారం తీన్మార్ మోగించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అసెంబ్లీ ఎన్నికలు తలపించే రీతిలో పోటాపోటీ ప్రచారం నిర్వహించారు. ఆరు రోజుల పాటు నిర్విరామంగా సాగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగిసింది. మరో 24 గంటల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం ముగియడంతో అభ్యర్థులు, నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే పనిలో పడ్డారు. గత కొద్దిరోజుల ముందు నుంచే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంటింటికి తిరిగి మద్యం, డబ్బులు పంపిణీ చేశారు. పలు చోట్ల బియ్యం, చీరలు, తాయిలాలు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ సింబల్తో ఉన్న పోలింగ్ రశీదులు ఇంటికి పంపిణీ చేస్తున్నారు. ఆ రశీదులు చూపించన వారికి ఇల్లు ఇల్లు తిరిగి డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఓటుకు సగటున రూ.1500 నుంచి రూ.5వేల వరకు ఇవ్వనున్నారు. చివరి రోజు ప్రచారం ముగింపు సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని 17 ము న్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు తీన్మార్ మోగించారు. కాంగ్రెస్ అభ్యర్థులు పలు చోట్ల అప్పుడే టపాసులు కాల్చి గెలుపు సంబరాలకు సంకేతాలు ఇస్తున్నారు.

జిల్లా మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ కార్పోరేషన్ అభ్యర్థుల పక్షాన ఆరు రోజుల పాటు అవిశ్రాంతంగా రోడ్ షోలు నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ సోమవారం హెలికాప్టర్లో తిరుమలగిరి, కోదాడ, హుజూర్నగర్ లో ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని మున్సిపాలిటీల్లో క్లీన్ స్వీప్ చేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గత ఆరు రోజుల నుంచి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పోటాపోటీగా పుర పోరును వేడెక్కించారు. మిర్యాలగూడలో సీఎం రేవంత్ సభ తర్వాత ఎన్నికల హీట్ మరింత పెరిగింది. ఇంటిలిజెన్స్ సర్వేల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసినప్పటికీ పలు మున్సిపాలిటీల్లో అభ్యర్థుల పనితీరు సరిగాలేదని తేలడంతో ఎమ్మెల్యేలు మరింత జాగ్రత్త పడ్డారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సూర్యాపేటలో రోడ్ షో నిర్వహించి కాంగ్రెస్ పైన నిప్పులు చెరిగారు.

n uttam kumar reddy edited

ఉమ్మడి జిల్లాలోని 16 మున్సిపాలిటీలు, నల్లగొండ కార్పోరేషన్ క్లీన్ స్వీప్ చేస్తాం. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవబోతున్నరు. మరో మూడేళ్ల పాటు మా ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. వచ్చే ఐదేళ్లు కూడా కాంగ్రెస్సే అధికారంలో ఉంటది. కాబట్టి ఈ ఎనిమిదేళ్లలో మున్సిపాలిటీలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. విద్యా, వైద్యంతో సహా, ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతులు కల్పిస్తాం. ఈ ఎన్నికల్లో సన్నబియ్యం, రేషన్ కార్డులు గేమ్ చేంజర్ కాబోతున్నాయి.

k venkat reddy

పూటకో పార్టీ మారే వాళ్లను గెలిపించొద్దు, ఇతర పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలకే నష్టం. నల్గొండను కార్పోరేషన్ చేసుకున్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీగా నిధులు వస్తాయి, అన్ని డివిజన్లలో సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తా, 24 గంటల తాగునీటి సరఫరాకు కట్టుబడి ఉన్నా, ఇంకా మిగిలి ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డును పూర్తి చేయడంతో పాటు సమస్యలు లేని కాలనీలుగా తీర్చిదిద్దుతా. ఇప్పటికే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో 2,200 కోట్లతో అభివృద్ధి పనులు చేశా, నల్లగొండ అభివృద్ధి మన చేతుల్లోనే ఉంది, ఇతర పార్టీల అభ్యర్థులను గెలిపించి మోస పోవద్దు.

k rajagopal reddy

చండూరులో ఇళ్లు కట్టుకునేందుకు జాగలేని నిరుపేదలకు నేనే స్వయంగా భూమిని కొనుగోలు చేసి ఇళ్లు కట్టిస్తాం. ప్రభుత్వ భూమి లేకున్నా, సొంత జాగలేని పేద, నిరుపేదలకు ఇళ్లు నిర్మిస్తా, రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలను శాసించే రోజు కూడా వస్తది. మునుగోడు గడ్డమీద నుంచి రాజకీయాలను శాసిస్తా, తెలంగాణ ఉద్యమకారులు, పేదలు, అవినీతికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా పేద వాళ్ల పక్షాన గొంతు వినిపించే పరిస్థితి వస్తది. కేసీఆర్ పాలనలో రాష్ట్రం దోపిడీకి గురైంది, ఇక్కడ సంపద అంతా ఆంద్రోళ్ల కు దోచిపెట్టింర్రు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత ఇక్కడ ఓటు విలువ పెరిగింది, నా ఎమ్మెల్యే పదవి త్యాగం వల్ల నాకు అన్యాయం జరిగిన మునుగోడు ప్రజలకు న్యాయం జరిగింది.

jagadish reddy

సూర్యాపేటకు మంజూరైనా నిధులు వెనక్కి పంపిన దుర్మారం కాంగ్రెస్ ది. స్పోట్స్ స్కూల్, స్టేడియం ఆధునీకరణకు 25 కోట్లు, మహిళా పాలిటెక్నిక్ కళాశాల, హాస్టల్ భవనాలకు 25 కోట్లు, భానుపురి కళా భారతి ఏర్పాటుకు 50 కోట్లు, సీఎం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ 50 కోట్లు, స్కిల్ డెవలప్మెంట్ కు 25 కోట్లు. ఇలా కోట్లాది రూపాయలను వెనక్కి పంపిన పాపం కాంగ్రెస్ది. మరోసారి కాంగ్రెస్ కు ఓటేస్తే, మరింత గోసపడతం. కెసిఆర్ అన్నట్టుగానే మళ్లీ 2014 కు ముందు రోజులోచ్చినయ్, మంత్రుల మధ్య సఖ్యత లేక ఒకరి బండారం ఒకరు బయటపెట్టుకుంటున్నరు, వాళ్ళల్లో పంపకాల పంచాయితే కాదు, రాసలీలల పంచాయితీలు పెట్టుకోవడం మరీ నీచం. ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారుల పై కూడా అబండాలు వేస్తున్నరు.

mp chamala

ఇసుక మాఫియా మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ మాయ మాటలకు మోసపోయి మీ ఓటును వ్యర్ధం చేయోద్దు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవస్థలను బలహీనపరిచింది. తిరుమలగిరి, మోత్కూరు మున్సిపాలిటీలను గెలిపించి మంత్రి ఉత్తమ్కు బహుమతి గా ఇద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాల బలోపేతానికి చర్యలు తీసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి.

Share
Share