రైతు భరోసా రాలేదు రైతు పండుగ చేసేదెలా? రైతు రుణమాఫీ కాలేదు విజయోత్సవాలు జరిపేదెలా? ముఖ్యమంత్రి?

పింఛన్ రూ. 4000లకు పెంచలేదు విజయోత్సవాలు జరిపేదెలా ముఖ్యమంత్రి గారు?

ఆరు గ్యారంటీలు అమలు కాలేదు విజయోత్సవాలు జరిపేదెలా ముఖ్యమంత్రి గారు అంటూ ముఖరా కె గ్రామంలో రైతులు, యువకులు, వ్యవసాయ కూలీలు, పింఛన్ దారుల నిరసన.

mukhra k village farmes protest 1

100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పి ఏడాది అవుతున్నా ఒక్క హామీ కూడా అమలు కాలేదని, ప్రభుత్వం మాత్రం విజయోత్సవాలు జరపడం సిగ్గు చేటని, రైతు భరోసా రాలేదు రైతు పండుగ జరిపేదెలా? రూ. 2 లక్షల రుణమాఫీ కాలేదు విజయోత్సవాలు జరిపేదెలా? ఉద్యోగాలు రాలేదు, పింఛన్ రూ. 4000 పెంచలేదు, మహిళలకు రూ. 2500 రాలేదు, డిగ్రీ అమ్మాయిలకు స్కూటీలు రాలేదు విజయోత్సవాలు జరిపేదెలా ముఖ్యమంత్రి గారు అంటూ ప్లకార్డులు పట్టుకొని వ్యవసాయ క్షేత్రంలో రైతు బందు గోవిందా, రుణమాఫీ గోవిందా, పింఛన్ పెంచుడు గోవిందా, కేసీఆర్ కిట్ గోవిందా, 6 గ్యారంటీలు గోవిందా అంటూ నిరసన తెలిపిన ముఖరా కె గ్రామస్తులు.

mukhra k village farmes protest 4


ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాడ్గే మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గే సుభాష్, అశోక్, దత్త, పరమేశ్వర్, ప్రహ్లాద్, బాలాజీ రైతులు యువకులు పాల్గొన్నారు.

mukhra k village farmes protest 3
mukhra k village farmes protest 2
Share
Share