నేరేడు చర్ల, ఏపీబీ న్యూస్: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో భార్యాభర్తలిద్దరూ కౌన్సిలర్లుగా గెలిచారు. నేరేడుచర్ల మున్సిపాలిటీ ఎన్నికలలో భార్య కాంగ్రెస్ పార్టీ తరఫున కొనతం మంజుల 4వ వార్డు నుండి బరిలో నిలిచి కౌన్సిలర్ గా గెలుపొందగా భర్త కొనతం చిన వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున 15వ వార్డు అభ్యర్థిగా నిలిచి కౌన్సిలర్ గా గెలుపొందాడు. దీంతో ఒకే పార్టీ, ఒకే ఇంటి నుండి భార్యాభర్తలు ఇద్దరూ గెలవడంతో నేరేడుచర్ల మున్సిపాలిటీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
తిరుమలగిరి:
తిరుమలగిరి మున్సిపాలిటీలో తల్లి కొడుకు కౌన్సిలర్లుగా విజయం సాదించారు. బిఆర్ఎస్ తరఫు నాలుగో వార్డ్ కౌన్సిలర్ గా బత్తుల శకుంతల విజయం సాధించగా ఏడవ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె కుమారుడు బత్తుల శీను విజయం సాధించారు.