శిలాఫలకాలను ధ్వంసం చేస్తూ ఎమ్మెల్యే రాక్షసానందం: మాజీ ఎమ్మెల్యే

నకిరేకల్​, ఏపీబీ న్యూస్​: నకిరేకల్​ నియోజకవర్గంలో తాము అధికారంలో ఉన్నప్పుడు తెచ్చిన పనులకే ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేస్తుండని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ మండలంలోని మోదినిగూడెం గ్రామంలో బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన శిలాఫాలకాలను ధ్వంసం చేసిన ఘనటపై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేము వేసిన శిలాఫలకాలను ధ్వంసం చేస్తూ ఎమ్మెల్యే రాక్షసానందం పొందుతున్నాడని ఆరోపించారు. శిలాఫలకాలు ధ్వంసం చేసినంత మాత్రాన మేము చేసిన అభివృద్ధినీ చెరపలేరని, గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార మదంతో రెచ్చిపోతున్నారని అన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్తే ఓర్చుకోలేక ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నాడని అన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో ఏం జరుగుతోందో రిపోర్ట్ తెప్పించుకోవాలని డీజీపీని కోరారు. నకిరేకల్ లో ఆటవిక, అరాచక పాలన నడుస్తుందని, ఎమ్మెల్యే నివాసం అడ్డాగానే దందాలకు పాల్పడుతున్నారని అన్నారు. మితిమీరి ప్రవర్తిస్తున్న అధికారులకు ఇంతకు ఇంత మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

Share
Share