- కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండటం తెలంగాణ దరిద్రం
- రాష్ట్రంలో దద్దమ్మ పాలన నడుస్తుంది
- రెండేళ్ల లో పాలమూరు లో తట్టెడు మట్టి కూడా తీయలేదు
- రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం
- బీ ఆర్ ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్
హైద్రాబాద్, ఏపిబీ న్యూస్: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వల్ల తెలంగాణకు దరిద్రం పట్టుకుందని, ఇంకో వైపు రాష్ట్రంలో దద్దమ్మ పాలన నడుస్తోందని మాజీ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఆదివారం హైద్రాబాద్ లో పార్టీ ఆఫీసులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణకు పెనుశాపంగా పరిగణించిందని ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు చేశారు. కృష్ణా బేసిన్ లో 174టీఎంసీలు మహబూబ్నగర్ జిల్లాకు రావాలనీ,సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అత్యంత వివక్షకు గురైన జిల్లా మహబూబ్నగర్ అని అన్నారు. పాలమూరు రంగారెడ్డికి బీఆర్ఎస్ హాయాంలో 90.81టీఎంసీలు సాధించమనీ చెప్పిన కేసీఆర్..ఈ రెండేళ్ల లో పాలమూరు లో తట్టెడు మట్టి కూడా తీయలేదని మండి పడ్డారు. ఆర్డీఎస్ దగ్గర చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలు మూడు సార్లు బాంబులు పెట్టి పేల్చారనీ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం, కేంద్రం కలసి తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయనీ, ఇది వెనుకబడిన ప్రాంతం కాదు అని తెలంగాణ వెనక్కు నెట్టివేయబడ్డ ప్రాంతమని అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు పాలమూరు జిల్లాకు తీరని ద్రోహం చేశాయనీ, గంజి కేంద్రాలు పెట్టే స్థాయికి పాలమూరు జిల్లా పడిపోయిందనీ విచారం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రలోనే సమగ్ర అభివృద్ధి చంద్రబాబు అప్పట్లో స్లోగన్ తీసుకున్నారనీ, ఏదో పొడిచేస్తానని సీఎం హోదాలో చంద్రబాబు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నారనీ గుర్తు చేశారు. చంద్రబాబు, నితీష్ మీద ఆధారపడి బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతుందనీ, నదీ జలాల కోసం ఢిల్లీకి రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని తీసుకెళ్ళాలనీ డిమాండ్ చేశారు. డీపీఆర్ వాపస్ పంపితే.. కాంగ్రెస్ సర్కార్ ఎందుకు మౌనంగా ఉందనీ కేసీఆర్ ప్రశ్నించారు.