గిరిజన సంక్షేమ శాఖ ఐటీడీఏ డిపార్ట్మెంట్ EE గా 39 సంవత్సరాలు విధులు నిర్వహించి ఈరోజు పదవి విరమణ పొందుతున్న రాథోడ్ భీంరావ్ నాయక్ గారి పదవి విరమణ ఆత్మీయ సన్మాన సభ కార్యక్రమం ఉట్నూర్ లోని పెర్క గూడ, జేసీబీ గార్డెన్ లో ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మా బొజ్జు పటేల్, మాజీ మంత్రి అమర్ సింగ్ తిలవత్ తో కలిసి ఆదిలాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ పాల్గొని రాథోడ్ భీంరావ్ నాయక్ ని శాలువతో సన్మానించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ MLA రేఖ నాయక్, మాజీ MLA రాథోడ్ బాపురావు, ఆత్రు సుగుణ, మాజీ జడ్పీటీసీ చారులత రాథోడ్, రితేష్ రాథోడ్, ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ ప్రకాష్, సుమన్ బాయి జాధవ్,రిమ్స్ డైరెక్టర్ దేవిసింగ్,అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.