మున్సిపల్​ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయోద్దు: రాష్ట్ర ఎన్నికల కమిషనర్

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: మున్సిపల్ ఎన్నికలలో ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని, ఏడీజీ మహేష్ భగవత్ లతో కలిసి హైదరాబాద్ నుండి మున్సిపల్ ఎన్నికల పై ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్ జనరల్ అబ్జర్వర్లు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని మాట్లాడుతూ ఎన్నికలను నిష్పక్షపాతంగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని, ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా ఆమె వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు.

డి ఐ జి మహేష్ భగవత్ మాట్లాడుతూ ఎన్నికల సందర్బంగా అక్రమ మద్యం, డబ్బు, ప్రలోబాలకు గురి చేసే సామాగ్రిని ఎప్పటికప్పుడు ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి బృందాలు నిరంతరం నిఘా ఉంచాలని, అలాగే అంతరరాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేశామని, రౌడీ షీట్ నమోదైన వారిపై  పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ షాడో టీమ్ నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు.

Share
Share