*పంచాయతీ ఎన్నికల్లో వలసల ముప్పు
*స్పష్టమవుతున్న వలస రాజకీయాల ప్రభావం
*అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రోత్సహించిన నేతలు
*ఇప్పుడేమో కమిటీల ముందు తేల్చుకోమంటున్న వైనం
*వర్గపోరుతో గ్రామాల్లో కలుషితమవుతున్న రాజకీయం
నల్లగొండ(APB News): ‘మనం వర్తమానంలో చేసే చర్యలు లేదా పనులు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి’. మహాత్ముడి మాట.
‘ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో జరుగుతున్న వర్తమాన పరి స్థితులు చూస్తుంటే భవిష్యత్తు ఇంకెలా ఉంటుందో ఊహించు కుంటేనే ఆందోళన కలిగిస్తోంది. వలస రాజకీయాల వల్ల లబ్ధి పొందుతున్నది ఎ వరు? వలసలను ప్రోత్సహించడం వల్ల లా భం ఎంత? నష్టం ఎంత? అనేది ఒకసారి ఆలోచిస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడో ఒక అంచనాకు రావొచ్చు..
గత పదేళ్లలో వలస రాజకీయాలు మితిమీరిపోయాయి. దీనివల్ల గ్రా మస్థాయిలో రాజకీయ విలువలు దిగజారిపోతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు నేతలు తమ అవసరాల కోసం వలసలు ప్రో త్సహించడం సహజం. కానీ దీని ప్రభావం గ్రామ రాజకీయాలను పూర్తిగా కలుషితం చేస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థు లు తలపడుతున్న తీరును చూస్తుంటే వలస రాజకీయాల ప్రమా ద తీవ్రతను తేటతెల్లం చేస్తున్నాయి.
కమిటీల ఉచ్చుల్లో పల్లెలు..
నాడు వలసలను ప్రోత్సహించిన రాజకీయపార్టీలు నేడు పంచాయ తీ ఎన్నికల్లో ఇరువర్గాలను సమన్వయం చేయలేని పరిస్థితి నెల కొంది. పంచాయతీ పదవుల కోసం పోటీపడుతున్న ఇరువర్గాలను బుజ్జిగించి, భవిష్యత్తు పదవుల పైన ఆశలు కల్పించేందుకు ఏర్పాటై న మండల, గ్రామ కమిటీలు ఆధిపత్యం కోసం ఆరాట పడుతున్నా యి. రాజకీయ పార్టీల ప్రతినిధులుగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు చేయలేని పని కమిటీలు చేస్తాయా? వాటి వల్ల సాధ్య మవుతుందా? అంటే పంచాయతీ ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్య ర్థులను చూస్తే ఆ ప్రయత్నాలు బెడిసికొట్టాయనే చెప్పొచ్చు. రాజకీ యపార్టీల ప్రతినిధులు పూర్తి నిర్ణయాధికారాన్ని కమిటీలకే అప్ప గించడం వల్ల వాళ్ల ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు వర్గపోరును మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి.
వలసలతో లబ్ధి ఎవరికీ?
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసొచ్చిన లీడర్లు బలంగా ఉన్న చో ట కాంగ్రెస్ వర్గం తీవ్ర అసంతృప్తితో రగలిపోతోంది. దీనికి కారకులు ఎవరు? అని ఆలోచిస్తే. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తమ గెలు పు కోసం అప్పుడున్న రాజకీయ పార్టీలు వలసలు ప్రోత్సహించా యి. వలసల వల్లే పార్టీకి బలం చేకూరుతుందని, దాంతోనే తాము అధికారంలోకి వచ్చామని చెప్పుకునే ప్రజాప్రతినిధులు సొంత పార్టీ కేడర్ను కాపాడుకోవడంలో విఫలమవుతున్నారు. దాంతోనే పంచా యతీ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా అభ్యర్థులు పో టీలో నిలబడ్డారు. బీఆర్ఎస్ నుంచి వలసొచ్చిన అభ్యర్థులు ఒకవై పు, మొదటి నుంచి పార్టీనే నమ్ముకున్న కాంగ్రెస్ కేడర్ మరోవైపు ఈ రెండు వర్గాల్లో ఎవరికి మద్ధతు ఇవ్వాలి? ఎవరిని పోటీ నుంచి త ప్పించాలి? అనేది ప్రజాప్రతినిధులకు సవాల్గా మారింది. ముఖ్యం గా రాజకీయ ఆధిపత్యాన్ని ప్రదర్శించే పంచాయతీలు, నియోజకవ ర్గాల్లో ఈరకమైన దోరణి కనిపిస్తోంది.
స్ధానిక నాయకత్వాన్ని పావులా వాడుకుంటున్నారా..?
స్థానిక గ్రామ రాజకీయాలను ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు పావులా వాడుకుంటున్నారా? అంటే తాజా పరిణామాలు పరిశీలిస్తే నిజమే అనిపిస్తోంది. పదేళ్లకు పూర్వం కాంగ్రెస్లో గెలిచిన సర్పంచ్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు బీఆర్ఎస్ పవర్లోకి వచ్చాక కాంగ్రె స్ను వదిలిపెట్టారు. దాంతో గ్రామాల్లో బీఆర్ఎస్ బలం పెరిగింది. మ ళ్లీ పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పవర్లోకి రావడంతో సొంతగూటికి వచ్చా రు. వీళ్లతోపాటే మొదటి నుంచి బీఆర్ఎస్లో పనిచేసిన కేడర్ సైతం కాంగ్రెస్ గూటికి చేరింది. ఈ గ్రూపులన్నీ ఒకేదగ్గరికి చేరడంతో పద వుల కోసం కొట్లాట మొదలైంది. ఎవరికి వారే రాజకీయ ప్రయోజనా లు ఆశించి వలసలు ప్రోత్సహించారు. కానీ ఇప్పుడు అవే వలసలు ఎమ్మెల్యేలకు సవాల్ విసురుతున్నాయి. అధికారంలోకి వచ్చేందు కు స్థానిక నాయకత్వాన్ని పావులా వాడుకున్న రాజకీయ పార్టీలు ఇరువర్గాలను సమన్వయం చేయలేకపోతున్నారు. దీనివల్ల గ్రా మాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యేలను గట్టిగా నిలదీ సే పరిస్థితి లేదు. స్థానికంగా మీరే తేల్చుకోండి. సమన్వయ కమిటీ ల వద్దే తేల్చుకోండి? మేం చెప్పినట్టు నడుచుకోకపోతే మీకే నష్టం అని హెచ్చరిస్తున్నారు. కానీ పదవుల కోసం ఆస్తులు తెగ నమ్ము కుంటున్న వారి పరిస్థితి ఆలోచిస్తేనే ఆందోళన కలుగుతోంది. రాష్ట్రం లోని మెజార్టీ గ్రామాల్లో కేవలం సర్పంచ్ పదవి కోసం ముగ్గురు, న లుగురు పోటీ పడుతున్నారు. ఇక వార్డు మెంబర్లకు సైతం అదేరక మైన పోటీ ఉండటం మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. లక్షలు ఖర్చు పెట్టొద్దు..? ఏకగ్రీవాలు చేసుకోండి అని సీఎం రేవంత్ రెడ్డి చె ప్పిన మాటల వెనక ఆంతర్యం ఇదే కావొచ్చుఅనిపిస్తోంది.