దేవరకద్ర (APB News): దేవరకద్ర ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన దేవరకద్ర మండల కాంగ్రెస్ నాయకులు, ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు లక్ష్మీకాంత్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్.డి ఫారూఖ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు అంజల్ రెడ్డి మాట్లాడుతూ దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) ఆదేశాల మేరకు రేపు మధ్యాహ్నం 3-00 గంటలకు దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ. శ్రీనివాస గార్డెన్స్ లో దేవరకద్ర మార్కెట్ యార్డ్ నూతన కార్యవర్గం మరియు శ్రీ ఈశ్వర వీరప్పయ్య దేవాలయ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం తలపెట్టడం జరిగిందని… ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ. జూపల్లి కృష్ణారావు, దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి. మధుసూదన్ రెడ్డి (GMR), తదితర కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొంటారని తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమంలో దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయగలరని కోరారు.

ఈ కార్యక్రమంలో దేవరకద్ర మార్కెట్ యార్డ్ చైర్మన్ కథలప్ప, శ్రీ ఈశ్వర వీరప్పయ్య దేవాలయ చైర్మన్ బీస్ నర్సింహారెడ్డి, పట్టణ కాంగ్రెస్ నాయకులు ఆది హనుమంత రెడ్డి, కొండా గోవర్ధన్ రెడ్డి, రాంపండు, కొండ శ్రీనివాస్ రెడ్డి, నర్వ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు రాము, దనుంజయ, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.