తెలంగాణలో డెంగ్యూ డేంజర్‌ బెల్స్‌…దవాఖానలో సౌలతులు లేక అల్లాడుతున్న జనం

రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల వద్ద జ్వరపీడితులు బారులు తీరుతున్నారు. సాధారణం కంటే 20 శాతం ఎక్కువ కేసులు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌లో డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. నివారణ చర్యలు చేపట్టకపోవడంతో డెంగీ కేసులు పెరుగుతున్నాయని రోగులు వాపోతున్నారు.

వరంగల్ జిల్లాలో జ్వరపీడితుల సంఖ్య పెరుగుతుంది. ఎంజీఎంలో రోజుకు 30 జ్వరం కేసులు నమోదవగా, రెండు డెంగీ జ్వరం కేసులు నమోదయ్యాయి. 20 పడకలతో ప్రత్యేక జ్వర విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఎంజీఎం ఆస్పత్రిలో ప్రస్తుతం సరిపడా మందులు ఉన్నాయని.. డెంగ్యూ ఇమేజింగ్ ఫీవర్, డెంగ్యూ షాట్ సిండ్రోమ్ వస్తే వెంటనే హాస్పిటల్‌లో అడ్మిట్ కావాలని సూపరింటెండెంట్ మురళి తెలిపారు.

Share
Share