నిడమనూరు(APB News): నిడమనూరు మండలంలోని మండల కేంద్రానికి చెందిన గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రామంలో నిధులు దుర్వినియోగం చేస్తూ, అక్రమ పద్ధతిలో బిల్లులు వసూలు చేసి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను, సీపీఎం మండల కార్యదర్శి కందుకూరి కోటేష్ లు ఆరోపించారు.
సోమవారం నిడమనూరు మండల కేంద్రంలో విలేకరులతో వారు మాట్లాడుతూ, గ్రామంలో గత 15 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న ఇంటి పన్ను బకాయిలను వసూలు చేసి రెండు సంవత్సరాలకు సంబంధించి బిల్లులు చెల్లించినట్టు రసీదులు ఇ చ్చారని వారు ఆరోపించారు. ఇంటి పర్మిషన్ కొరకు అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నారని, డెత్ సర్టిఫికెట్ కొరకు చేతులు తడపందే పని జరగడం లేదని వారన్నారు. గ్రామపంచాయతీ ట్రాక్టర్ రిపేర్ల పేరు మీద అవసరం ఉన్నా లేకున్నా రిపేర్లు చేయించినట్టు బిల్లులు సృష్టించి డబ్బులు నొక్కేసారని, ఇంటి రిజిస్ట్రేషన్ కొరకు, మ్యూటేషన్ కొరకు ఇష్ట రాజ్యాంగ వేల రూపాయలు అక్రమ పద్ధతులలో వసూలు చేసి గ్రామపంచాయతీ ఖాతాలో జమ చేయకుండా భాగాలు పంచుకొని ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్నారని వారన్నారు.
గ్రామపంచాయతీ కార్మికులను దళితులనే చిన్న చూపుతో హేళన చేస్తూ మాట్లాడుతున్నారని, వ్యక్తిగత శుభ్రత పాటించిన ఓర్చుకోలేకపోతున్నాడని, మీరు మంచి బట్టలు, మంచి వాహనాలు మీకు ఎందుకు, మీరు ఆఫీసర్ లాగా పనికొచ్చి ఎక్కడ చేస్తారు అంటూ కులం పేరుతో అవహేళనగా మాట్లాడుతున్నాడని వారన్నారు. డ్యూటీలకు ఆలస్యంగా వస్తున్నారని కారణంతో జీతాలు కట్ చేస్తున్నాడని, ఎక్కడ లేని విధంగా నిడమనూరు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్మికులపై తీవ్రమైన ఒత్తిడి పని భారాన్ని పెంచి మానసికంగా శారీరకంగా కార్మికులను ఇబ్బందులు గురిచేస్తున్నాడని, ఇదేంటని కార్మికులు అడిగితే కార్మికులను తిట్టడంతో పాటు అవహేళన చేస్తూ, చేతకాకపోతే, చెప్పినట్టు వినకపోతే వెళ్లిపోండి అని బెదిరిస్తూ, ఉద్యోగాల నుండి తొలగిస్తామని బెదిరిస్తున్నాడని వారు తెలిపారు.
ఎవరు చేయాల్సిన పని వారు చేస్తుండగా కక్ష సాధింపు తోటి రోజుకో రకమైన పని చెబుతూ పనిచేయటం లేదని కార్మికులను దుర్భాషలాడుతున్నాడని వారన్నారు. కార్యదర్శి తన పని తాను చేయకుండా రాజకీయాలు చేస్తూ, రాజకీయ నాయకులతో కార్మికులను ఇష్టం వచ్చిన విధంగా తిట్టిస్తూ వారిని మానసికంగా ఇబ్బందుల గురి చేస్తున్నాడని వారన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న, గ్రామపంచాయతీ కార్మికుల పట్ల వివక్ష కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న పంచాయతీ కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేసి, వసూలు చేసిన గ్రామపంచాయతీ నిధులను రికవరీ చేసి గ్రామపంచాయతీ ఖాతాలో జమ చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా కాపాడాలని వారు కోరారు.లేకుంటే జిల్లా అధికారులను కలిసి పిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు. వారివెంట మండల కమిటీ సభ్యులు కుంచెం శేఖర్ తదితరులు ఉన్నారు.