- మిర్యాలగూడ, భువనగిరిలో కౌన్సిలర్ల ఆవేధన
- చైర్మన్ పదవి కోసం ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన నూకల కవిత
- ఎన్నికల్లో పెట్టుబడి పెట్టి చేతులు కాల్చుకున్న గంజి శ్రీవాణి
- జానారెడ్డి చెప్పినా ఎమ్మెల్యే బత్తుల వినలే
- ఎంపీ చామల కిరణ్ ఫోన్‌తో భువనగిరిలో క్యాండేట్ మార్పు
- చివరకు బీసీలను వరించిన చైర్మన్ పదవులు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఎమ్మెల్యేలను నమ్ముకుని ఎన్నికల్లో పోటీ చేస్తే చైర్మన్ పదవి ఇవ్వకుండా మోసం చేశారని మిర్యాలగూడ, భువనగిరి కౌన్సిలర్లు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. మిర్యాలగూడ చైర్మన్ పదవి ఇస్తానని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి హామీ ఇవ్వడంతోనే నూకల వేణుగోపాల్ రెడ్డి భార్య కవిత నెలకు లక్ష సంపాధించే ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదలుకున్నారు. 2020 ఎన్నికల్లో కౌన్సిలర్గా గెలిచిన కవిత అప్పుడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు. మళ్లీ ఈ ఎన్నికల్లో చైర్మన్ పదవి ఇస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో అదే ఉద్యోగానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్న వేణుగోపాల్ రెడ్డి కుటుంబం సీనియర్ నేత జానారెడ్డికి అత్యంత సన్నిహితులు, జానారెడ్డి సన్నిహితులు అని ముద్ర ఉండటంమే వేణుగోపాల్ రెడ్డి కొంప ముంచింది. జానారెడ్డి, ఆయన కొడుకు ఎంపీ రఘువీర్ సైతం కవిత పేరును చైర్మన్గా సిఫార్సు చేశారు. జానారెడ్డి చెప్పినట్టే నడుచుకుంటానని సీఎం రేవంత్ సభలో ప్రగల్భాలు పలికిన ఎమ్మెల్యే చివరకు ఆయన చెప్పిన నూకల కవితను చైర్మన్ చేయకుండా హ్యాండిచ్చారు, చివరి నిమిషంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన అతని అనుచరుడు చిలుకూరు సుధాబాలును చైర్మన్ చేయడంతో ఓటింగ్లో కవిత కంటనీరు పెట్టినట్టు తెలిసింది. ఎమ్మెల్యే హామీ మేరకే ఎన్నికల్లో రెండు కోట్ల వరకు ఖర్చు పెట్టారు. ఇంకో రెండు కోట్ల ఆర్ధిక సాయం చేశారని కూడా చెప్తున్నారు. నిజానికి మొత్తం 31మంది కౌన్సిలర్లలో పదిహేను మందికి పైగా వేణుగోపాల్ రెడ్డికే మద్ధతు తెలిపారు. ఐదారుగురు మాత్రమే సుధాబాలు చెప్పారని కానీ ఎమ్మెల్యే అవేమీ పట్టించుకోకుండా చివరి నిమిషంలో మోసం చేశారని వేణుగోపాల్ రెడ్డి అనుచరులు వాపోతున్నారు.
ఇక భువనగిరిలో ప్రముఖ బిల్డర్ గణేష్ రెడ్డి భార్య శ్రీవాణి రెడ్డికి చైర్మన్ ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతోనే ఎన్నికల్లో భారీగా పెట్టుబడి పెట్టారు. బీటెక్ చదవిన శ్రీవాణి భువనగిరి రూరల్ ప్రాంతానికి చెందిన వ్యక్తిని, భువనగిరి పట్టణ వాసులకే చైర్మన్ పదవి ఇవ్వాలనే డిమాండ్ ఆఖరి నిమిషంలో తెరపైకి తెచ్చారు. దీని వెనక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రమేయం ఉందని, దాంతోనే తనకు చైర్మన్ రాకుండా అడ్డుకున్నారని గణేష్ రెడ్డి అనుచరులు అంటున్నారు. చైర్మన్ ఎన్నిక సమయంలో కూడా శ్రీవాణి అందరి సమక్షంలో కంటనీరు పెట్టారు. ఎమ్మెల్యే అనిల్ బుజ్జగించినప్పటికీ ఆమె బాధను దింగమింగులేక పోయారు.