Breaking News:కాంగ్రెస్ జైత్రయాత్ర.. నల్గొండ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు:

నల్గొండ, ఏపీబీ న్యూస్: నల్గొండ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. హాలియా, నందికొండ, చండూరు, చిట్యాల, మరియు దేవరకొండ మున్సిపాలిటీలను కైవసం చేసుకుని తన రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకుంది. ఈ విజయాలతో జిల్లాలో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

నల్గొండ జిల్లాలోని ప్రధాన మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ముఖ్యంగా హాలియా, నందికొండలలో ప్రత్యర్థి పార్టీలకు నామమాత్రపు స్థానాలే మిగిల్చింది.

చండూరులో కాంగ్రెస్ 6 స్థానాలను గెలుచుకుని మెజారిటీ సాధించగా, బీఆర్ఎస్ 3, సిపిఐ 1 స్థానాన్ని దక్కించుకున్నాయి.

వార్డు నం.విజేత పేరురాజకీయ పార్టీ
1తేలుకుంట్ల రాజకుమారిబీఆర్ఎస్
2భూష్పాక వాసుకాంగ్రెస్
3సామ సుజాతబీఆర్ఎస్
4జల్ల ధనమ్మసిపిఐ
5కొండ్రెడ్డి మధుబీఆర్ఎస్
6కోడి శ్రీనివాసులుకాంగ్రెస్
7కోడి సుష్మకాంగ్రెస్
8భూతరాజు దశరథకాంగ్రెస్
9కలిమికొండ పారిజాతకాంగ్రెస్
10కటికం రమేష్కాంగ్రెస్

నందికొండలో కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. 12 వార్డులకు గాను 11 వార్డుల్లో విజయఢంకా మోగించింది.

  • కాంగ్రెస్: 11 స్థానాలు
  • బీఆర్ఎస్: 01 స్థానం
  1. యాకిడి నాగమల్లేశ్వరి (కాంగ్రెస్) – 225 ఓట్ల మెజారిటీ
  2. నటువ నరేందర్ (కాంగ్రెస్) – 71 ఓట్ల మెజారిటీ
  3. గొడవర్తి రాజా ప్రసాద్ (కాంగ్రెస్) – 314 ఓట్ల మెజారిటీ
  4. మంద గౌతమి (కాంగ్రెస్) – 256 ఓట్ల మెజారిటీ
  5. పాయర్థ బాబురావు (కాంగ్రెస్) – 359 ఓట్ల మెజారిటీ
  6. ఆంగోతి చందులాల్ (కాంగ్రెస్) – 247 ఓట్ల మెజారిటీ
  7. మైలపల్లి జానకి (కాంగ్రెస్) – 342 ఓట్ల మెజారిటీ
  8. నకిరేకంటి రమణ (బీఆర్ఎస్) – 129 ఓట్ల మెజారిటీ
  9. ఈర్ల రామకృష్ణ (కాంగ్రెస్) – 399 ఓట్ల మెజారిటీ
  10. వి వేనిషా (కాంగ్రెస్) – 361 ఓట్ల మెజారిటీ
  11. పగడాల నాగరాజు (కాంగ్రెస్) – 295 ఓట్ల మెజారిటీ
  12. మానస స్వర్ణ (కాంగ్రెస్) – 324 ఓట్ల మెజారిటీ

సాగర్ నియోజకవర్గ కేంద్రమైన హాలియాలో కాంగ్రెస్ 11 వార్డులను గెలుచుకుని ప్రత్యర్థులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.

  • విజేతల జాబితా:
    • 1వ వార్డు: రాజారమేష్ (కాంగ్రెస్)
    • 2వ వార్డు: సైదులు (కాంగ్రెస్)
    • 3వ వార్డు: వెంకట్ రెడ్డి (కాంగ్రెస్)
    • 4వ వార్డు: ప్రమీల (బీఆర్ఎస్) – 20 ఓట్ల మెజారిటీ
    • 5వ వార్డు: కర్ణసాగర్ (కాంగ్రెస్)
    • 6వ వార్డు: ఏసురాజు (కాంగ్రెస్)
    • 7వ వార్డు: చంద్రారెడ్డి (కాంగ్రెస్) – 651 మెజారిటీ
    • 8వ వార్డు: మధార్ (కాంగ్రెస్)
    • 9వ వార్డు: ముత్యాలు (కాంగ్రెస్)
    • 10వ వార్డు: అంజనేయులు (కాంగ్రెస్) – ఏకగ్రీవం
    • 11వ వార్డు: ప్రసాద్ (కాంగ్రెస్)
    • 12వ వార్డు: రంజిత్ (కాంగ్రెస్)

ఈ ఎన్నికల ఫలితాలు నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని నిరూపించాయి. హాలియా, నందికొండ, చండూరు వంటి కీలక ప్రాంతాల్లో సాధించిన విజయం రాబోయే రోజుల్లో జిల్లా రాజకీయాలను ప్రభావితం చేయనుంది. చిట్యాల మరియు దేవరకొండ మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ మెరుగైన ఫలితాలను సాధించి తన పట్టును నిలుపుకుంది.

Share
Share