నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తొలి బోణీ కొట్టింది. బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోవడంతో కాంగ్రెస్ అభ్యర్థు లు ఏకగ్రీవం గా ఎన్నికయ్యారు. వీళ్లలో ఒకరిద్దరు చైర్మన్ పదవి ఆశిస్తున్న కౌన్సిలర్లు కూడా ఉండటం గమనార్హం. కోదాడలో 11వ వార్డు అభ్యర్థి దేవరం మల్లేశ్వరి, 21 వ వార్డులో కట్టేబోయిన జ్యోతి శ్రీనివాస్ యాదవ్, 31వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ సర్పంచ్ యెర్నేని కుసుమ బాబు లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వీళ్లలో మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్న బాబు భార్య కుసుమ, సీనియర్ నేత లక్ష్మీనారాయాణ రెడ్డి సమీప బందువు దేవరం మల్లేశ్వరి రెడ్డి చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. వీళ్లతో పాటు చైర్మన్ రేసులో వెలమ సామాజికవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు వర్గానికి చెందిన ప్రగతి ట్రాన్స్పోర్ట్ ఓనర్ గుండపనేని నాగేశ్వరరావు భార్య, బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ సర్పంచ్ పార సీతయ్య భార్య పోటీలో ఉన్నారు.
నల్లగొండ జిల్లాలో హాలియా మున్సిపాలిటీలో 10 వార్డు కు చెందిన పిల్లి చంద్రకళ కాంగ్రెస్ అభ్యర్థి, హుజూర్నగర్లో మూడో వార్డు నుంచి సులువ నాగలక్ష్మీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. యాదాద్రి జిల్లాలో చౌటుప్పుల్ మున్సిపాలిటీలో 17 వార్డుకు చెందిన చింతా సాయిలు భార్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.