నల్లగొండపై కాంగ్రెస్ జెండా ఎగరాలి: మున్సిపల్​ మాజీ చైర్మన్​

నల్లగొండ, ఏపీబీ న్యూస్​: కొత్తగా ఏర్పాటైన నల్లగొండ కార్పోరేషన్ ఎన్నికల్లో తొలిసారిగా కాంగ్రెస్​ జెండా ఎగురవేయాలని మున్సిపల్​ మాజీ చైర్మన్​ బుర్రిశ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ గుమ్మల మోహన్​ రెడ్డి, మాజీ వైస్​ చైర్మన్ అబ్బగోని రమేష్​ గౌడ్​ అన్నారు. అన్ని డివిజన్లో పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్పోరేషన్​ చేసిన సందర్భంగా క్లాక్​ టవర్​ సెంటర్​లో పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. కార్పోరేషన్​ చేసినందుకు సీఎం రేవంత్​ రెడ్డికి కృతజ్ఞతులు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..బిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో నల్లగొండ అభివృద్ధి గురించి పట్టించుకోలేదన్నారు. హంగు, ఆర్భాటాలు తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆరోపించారు. పట్టణంలో ఇప్పటికే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులు జరుగుతున్నాయని తెలిపారు. అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు ప్రజలకు కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయని, ఆ తర్వాత ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి అంతా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృషితోనే జరిగిందన్నారు.

congress leaders celebrations in nalgonda

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ తో పాటు పలువురు మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share
Share