కమ్యూనిస్టులను మోసం చేసిన కాంగ్రెస్..

  • ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఊళ్లో …సీపీఐకి​ షాక్​
  • సిట్టింగ్​ స్థానం కోల్పోవడం పైన పార్టీలో తీవ్ర పరిణామాలు

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్​: సీపీఐ ఎమ్మెల్సీ, జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ఊళ్లో సీపీఐకి కోలుకోలేని దెబ్బతగిలింది. పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల పైన సీపీఐ, సీపీఎం పార్టీలో పోస్టుమార్టం జరుగుతోంది. మొదటి నుంచి ఉన్నట్టుగానే కాంగ్రెస్​, సీపీఐ మధ్య ఈ ఎన్నికల్లో కూడా పొత్తు ఉంటదని ప్రకటించారు. అదే క్రమంలో సీపీఎం కూడా కలిసిపోవాలని నిర్ణయించింది. కానీ పార్టీ సింబల్​ లేకుండా జరిగిన ఎన్నికలు కావడంతో కమ్యూనిస్టులు కొన్ని చోట్ల బీఆర్​ఎస్​, బీజేపీతో కూడా దోస్తీ కట్టారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ నెల్లకంటి సత్యం స్వగ్రామం మునుగోడు మండలం ఎలగలగూడెంలో కాంగ్రెస్​ గెలుపొందడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఫలితాల పైన విశ్లేషించిన కమ్యూనిస్టులు కొన్ని చోట్ల కాంగ్రెస్​ సహరించినప్పటికీ, అభ్యర్థులు పోటాపోటీగా నిలబడిన చోట పొత్తు వర్కవుట్​ కాలేదు. దీంతో సీపీఐ సిట్టింగ్​ స్థానమైన ఎలగలగూడెంలో కాంగ్రెస్​ అభ్యర్థి గెలుపొందారు. మునుగోడు నియోజకవర్గంలో సీపీఐ, కాంగ్రెస్ కలిసి పోటీ చేయాలని భావించిన గ్రామాల్లో ఫలితాలు రివర్స్​ అయ్యాయి. ఒంటిరిగా పోటీ చేసిన సీపీఎంకు పలు చోట్ల బీఆర్​ఎస్ సహకరించింది. కానీ సీపీఐ కంచుకోటగా ఉన్న మునుగోడు మండలం కచలాపురంలో తొలిసారిగా కాంగ్రెస్​ గెలుపొందడం గమనార్హం. చల్మెడ గ్రామంలో కూడా సీపీఐ ఓడిపోయింది.

mlc nellikanti satyam

కాంగ్రెస్​ నుంచి రెబల్స్​ పోటీ చేయడం, గత ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్​ మద్ధతుదారుల పట్ల ప్రజల్లో సానుభూతి నెలకొనడంతో సీపీఐకు షాక్​ తగిలింది. దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సర్ధిచెప్పిన చోట సీపీఐ మద్ధతుదారులు గెలిచారు, కానీ చాలా చోట్ల డబ్బు ప్రభావం సీపీఐ అభ్యర్థుల పైన పడింది. జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం సొంత ఊళ్లోనే ఎన్నికల ఖర్చు రూ.30 లక్షలు దాటింది. దాంతోనే అక్కడ సీపీఐ సిట్టింగ్​ సీటు కోల్పోవాల్సి వచ్చింది.

Share
Share