రెవిన్యూ ఆఫీసర్లు..భూముల సమస్యలు త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

నల్లగొండ, ఏపీబీ న్యూస్​: పెండింగ్ లో ఉన్న భూ భారతి, భూ రికార్డులు, భూమి వివాదలు, రెవెన్యూ సదస్సులలో సాదా బైనామా లపై వచ్చిన దరఖాస్థలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్​ బి. చంద్రశేఖర్​ చెప్పారు. బుధవారం ఆయన కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రెవిన్యూ అధికారులతో  రెవెన్యూ అంశాల పై సమీక్షించారు. ప్రతి మండలంలో పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులను సమీక్షించాలని, భూ సంబంధ వ్యవహారాలలో పారదర్శకతకు ప్రాద్యనత ఇవ్వాలని తెలిపారు. అసైన్డ్ భూముల విషయంలో పెండింగ్ సమస్యలు త్వరగా పరిష్కరించాలని చెప్పారు.

మహిళలను కోటీశ్వరులుగా చేసే కార్యక్రమంలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి ఒక పెట్రోల్ బంకు ఏర్పాటు చేసేందుకు స్థలాలకై చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఓటరు మ్యాపింగ్ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 61 శాతం పూర్తి చేయడం జరిగిందని, దీనిని 75 శాతానికి తీసుకు వెళ్లేందుకు ప్రతిరోజు బిఎల్ఓ లతో సమీక్షించాలని అన్నారు.

Share
Share