భూభారతి సమస్యలు సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

యాదాద్రి, ఏపీబీ న్యూస్​: భూభారతి, రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యల దరఖాస్తులు పెండింగ్ లేకుండా  పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. మంగళవారం బీబీనగర్ లో తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, భూభారతి పెండింగ్, రిజిస్ట్రేషన్ దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్   మండలంలోని ఒక్కో గ్రామం వారీగా పెండింగ్ లో ఉన్న భూభారతి, రిజిస్ట్రేషన్ దరఖాస్తులను ఎలా పరిష్కరించాలనే విషయాలపై మార్గనిర్దేశం చేశారు.

భూ సమస్యల పై భూ భారతి లో చేసుకున్న దరఖాస్తులను పాత రికార్డుల ఆధారంగా అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలను, సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని అన్నారు. అర్జీలను తిరస్కరించినట్లైతే అందుకు గల కారణాలను స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. చిన్నచిన్న కారణాలతో అర్జీలను తిరస్కరించకూడదని అన్నారు.

Share
Share