శిథిలావస్థలో ఉన్నా ఎంపియుపియస్ పాఠశాలను, కళాశాల విద్యాధికారి కృష్ణయ్య, హెడ్మాస్టర్ చెన్నయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగారపు బీచుపల్లి తో కలిసి పరిశీలించినా వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి.
కొత్తకోట మండలం నాటవెల్లి గ్రామంలో ఉన్నా ప్రభుత్వ పాఠశాల ఎంతోమందిని ప్రజాప్రతినిధులుగా , ప్రయోజకులను తీర్చిదిద్దింది. అంత ఉత్తమమైన ఈ పాఠశాల ప్రస్తుతం శిథిలావస్థకు చేరి ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం గుప్పెట్లో సర్కారు సదువులు సాగుతున్నాయి. ప్రమాదకరంలో ఉన్న ఆ భవనంలో బిక్కుబిక్కుమంటూ చదువుకుంటున్న విద్యార్థులను గమనించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగారపు బీచుపల్లి చొరవ తీసుకొని దేవరకద్ర ఎమ్మేల్యే జి. మధుసూదన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే స్పందించి జిల్లా కలెక్టర్ ఆధర్స్ సురభిని కలిసి ప్రస్తుతం 127 మంది ఉన్నా విద్యార్థులు,శిథిలావస్థలో ఉన్నా పాఠశాలను జిల్లా కలెక్టర్ ని సందర్శించి రావాలనీ కోరడం జరిగింది..
ప్రస్తుతం ఒక్కటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు కొనసాగుతున్న ఈ పాఠశాలలో సుమారుగా 127 మంది వరకు ఉన్నా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ పాఠశాలకు ఎలాంటి మరమ్మతులు చేయకపోవడంతో పూర్తిగా పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. దీంతో తరచూ తరగతి గదుల్లో పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులపై పడుతున్నాయి.చిన్నపాటి వర్షం పడితే చాలు వాన నీరంతా తరగతి గదుల్లోకి చేరి విద్యార్థుల పుస్తకాలను తడిపి వేస్తున్నాయి. పాఠశాలలో ఎటు చూసినా ఊడిన పెచ్చులతో పాటు, ఇనుప చువ్వలు బయటకు తేలిన భయంకరమైన దృశ్యాలు ఈ పాఠశాలలో దర్శనమిస్తున్నాయి. భవనం చుట్టూ పెద్దపెద్ద వృక్షాలు ఉండడంతో ఈదురుగాలులు వచ్చిన ప్రతీసారి విద్యార్థులు భయాందోళనకు గురికావడం పరిపాటిగా మారింది. గత నాలుగు రోజుల నుంచి భారీగా వర్షాలు కురవడంతో గోడలన్నీ పూర్తిగా తడిచిపోయి ప్రమాదకరంగా మారాయి,పాఠశాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఉపాధ్యాయులు ముందస్తు చర్యలలో భాగంగా విద్యార్థులకు చెట్ల కింద పాఠాలు బోధిస్తున్నారని నాగారపు బీచుపల్లి జిల్లా కలెక్టర్ కి వివరించడం జరిగింది..అదే విధంగా జిల్లా కలెక్టర్ గారు క్రొత్తది త్వరలోనే శాంక్షన్ చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది..ఈ విషయం పై విద్యార్థుల తల్లీ,తండ్రులు,గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కలెక్టర్ ఆదర్శ్ సురభి కి అభినందనలు తెలిపారు.